Begin typing your search above and press return to search.

పంజరంలో పద్మావతి ఫోటోలకూ చిక్కదు

By:  Tupaki Desk   |   4 Nov 2016 10:30 PM GMT
పంజరంలో పద్మావతి ఫోటోలకూ చిక్కదు
X
పైరసీ దెబ్బకి సినిమాలు సినిమాలే లీక్ అయిపోవడం సంగతి అలా ఉంటే.. కొందరు దర్శకులు తమ చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్నీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కనీసం హీరో హీరోయిన్ల గెటప్స్ ని కూడా తాము రిలీజ్ చేసే ఫస్ట్ లుక్ వరకు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతుంటారు. అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టెక్నాలజీ విస్తృతం అయిపోయిన ఈ రోజుల్లో.. ఏదో ఓ రకంగా చిన్న చిన్న డీటైల్స్ కూడా తెలిసిపోతున్నాయి. దీన్ని అడ్డుకుని మరీ సీక్రెసీ పాటించేస్తున్నాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.

ఈ దర్శకుడు దీపికా పదుకొనే లీడ్ రోల్ లో పద్మావతి అనే చిత్రం తెరకెక్కిస్తుండగా.. ఇందులో రణవీర్ సింగ్- షాహిద్ కపూర్ లు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నాడు భన్సాలీ. యాక్టర్లు తమ కార్వాన్ నుంచి సెట్ కు వచ్చేప్పుడు.. తిరిగి కార్వాన్ లోకి వెళ్లేప్పుడు కూడా ఫోటోలు తీసే ఛాన్స్ లేకుండా మూవబుల్ టెంట్స్ ఏర్పాటు చేసింది పద్మావతి టీం. వీరి చుట్టూ బాడీగార్డులను అదనపు భద్రత కోసం ఏర్పాటు చేశారు.

పద్మావతిగా దీపికా.. ఆమె భర్తగా షాహిద్ కపూర్.. అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సింగ్ లు నటిస్తున్న ఈ మూవీ కోసం.. సంజయ్ లీలా భన్సాలీ తీసుకుంటున్న జాగ్రత్తలు సక్సెస్ అయితే.. ఈ రూట్ ని చాలామంది ఫాలో అయిపోయే ఛాన్స్ ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/