Begin typing your search above and press return to search.
హిందీలో 'ఖైదీనంబర్ 150'?
By: Tupaki Desk | 20 Aug 2018 4:47 AM GMTఇలయదళపతి విజయ్ నటించిన కత్తి 2014లో రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయ్- మురుగదాస్ కాంబినేషన్ పాపులారిటీ పెంచిన చిత్రమిది. ఆ సినిమానే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా `ఖైదీనంబర్ 150` పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ సినీరీఎంట్రీ అదిరిపోయింది. ఇండస్ట్రీ రికార్డ్ హిట్ విజయంతో మెగాస్టార్ రీలాంచ్ అవ్వడం చర్చకొచ్చింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. అప్పటివరకూ నాన్ బాహుబలి కేటగిరీలో ఉన్న అన్ని రికార్డుల్ని బద్ధలు కొట్టింది. రైతు సమస్యలు - విప్లవం నేపథ్యంలో ఎంతో కంటెంట్ తో.. కమర్షియల్ అంశాల మేళవింపుగా తెరకెక్కి అఖండ విజయం సాధించింది.
అందుకే ఈ సినిమా మళ్లీ మళ్లీ రీమేకవుతోంది. ఈసారి హిందీలో సంజయ్ లీలా భన్సాలీ లాంటి గ్రేట్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ రీమేక్ చేసేందుకు హక్కుల్ని ఛేజిక్కించుకున్నారు. భన్సాలీ ఇదివరకూ మురుగదాస్ డైరెక్ట్ చేసిన రమణ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇప్పుడు మరోసారి మురుగదాస్ సినిమా కత్తి రీమేక్ హక్కుల్ని ఛేజిక్కించుకున్నారు. మొత్తానికి బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సౌత్ సినిమా వెల్ ట్రీట్ కానుందని అర్థమవుతోంది.