Begin typing your search above and press return to search.
‘మనం’ మీద టాప్ డైరెక్టర్ కన్ను
By: Tupaki Desk | 4 May 2016 5:30 AM GMTఅక్కినేని కుటుంబం కోసమే ఈ కథ పుట్టిందా అనిపిస్తుంది ‘మనం’ సినిమా చూస్తుంటే. అది కూడా ఏఎన్నార్ జీవిత చరమాంకంలో ఈ కథ ఆ ఫ్యామిలీ దగ్గరికి రావడం.. ఈ సినిమాను పూర్తి చేశాక ఆయన చనిపోవడం.. అన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోయాయి. తెలుగు ప్రేక్షకులు.. దీన్ని తమ సినిమాగా భావించి గొప్పగా ఆదరించారు. తమిళంలో సూర్య-కార్తి హీరోలుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని చూశాడు జ్నానవేల్ రాజా. కానీ తర్వాత ఆ ప్రయత్నం మానుకున్నాడు. ‘24’ కథ చెప్పి మెప్పించి.. సూర్యతో ఆ సినిమా తెరకెక్కించాడు విక్రమ్.
ఐతే తమిళంలో కుదరకపోయినా హిందీలో అయినా ‘మనం’ రీమేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని విక్రమే స్వయంగా వెల్లడించాడు. టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ.. మనం మీద మనసు పడ్డాడట. విక్రమ్ దర్శకత్వంలో తనే ఆ సినిమాను నిర్మించాలని ఆయన భావిస్తున్నారట. కొన్ని రోజుల కిందట ‘24’ షూటింగ్ కోసం వెళ్లినపుడు ముంబయిలో బన్సాలీని కలిశానని.. ఆయన ‘మనం’ రీమేక్ గురించి తనతో మాట్లాడారని.. చాలా ఆసక్తి చూపించారని విక్రమ్ వెల్లడించాడు.
ఐతే రీమేక్ విషయంలో తుది నిర్ణయం ఏమీ తీసుకోలేదని.. ఆ చర్చ మాత్రం జరిగిందని విక్రమ్ తెలిపాడు. విక్రమ్ ‘24’ తర్వాత మహేష్ బాబు.. బన్నీలతో సినిమాలు చేయాల్సి ఉంది. మరి ‘మనం’ రీమేక్ అంటే కుదురుతుందా.. అయినా తమిళంలో రీమేక్ కు ఆసక్తి చూపించని వాడు.. హిందీకి మాత్రం ఓకే అంటాడా అన్నది డౌటు.