Begin typing your search above and press return to search.
త్రీడీలోనూ అలరించనున్న 'పద్మావతి'
By: Tupaki Desk | 26 Oct 2017 5:11 PM GMTసంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘పద్మావతి’ చిత్రంపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఆ చిత్ర ట్రైలర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన `ఘూమర్` పాట యూట్యూబ్ లో వైరల్ అయింది. ఈ సినిమా కోసం దీపికా పదుకొనే ప్రత్యేకంగా ఘూమర్ నృత్యాన్ని చాలా కష్టపడి నేర్చుకుందట. దీపికా నర్తించిన ఆ పాటను ఇప్పటికే 10లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ పాటను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన భన్సాలీ...సినిమాను మరింత గొప్పగా చిత్రీకరించి ఉంటాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ చిత్ర ట్రైలర్ -పాట వైరల్ కావడంతో పద్మావతిని త్రీడీలో కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం.
చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన పద్మావతి ప్రేక్షకులకు ఒక విజువల్ గ్రాండీర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని ఆ పాట చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమాలోని భారీ సెట్టింగులు, యుద్ధ సన్నివేశాలు, వస్త్రాలంకరణలను త్రీడీలో మరింత ఎఫెక్టివ్ గా చూపించ వచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో, భన్సాలీ కూడా త్రీడీ వెర్షన్ కు ఓకే చెప్పాడట.ఈ సినిమా అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ పారామౌంట్ పిక్చర్స్ కూడా త్రీడీ వెర్షన్ పై ఆసక్తి చూపుతోందట. దాదాపు 90కి పైగా దేశాల్లో ఈ చిత్రాన్ని పారామౌంట్ పిక్చర్స్ విడుదల చేయబోతోంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. బాహుబలి తర్వాత చారిత్రక నేపథ్యంలో రాబోతోన్న ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. పద్మావతి టైటిల్ రోల్ ను దీపికా పదుకునే పోషిస్తుండగా, ఆమె భర్త రావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అల్లా వుద్దీన్ ఖిల్జీ పాత్రను రణ్ వీర్ సింగ్ పోషించాడు. ఈ సినిమాను డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.