Begin typing your search above and press return to search.

అస్వస్థతతో ప్రముఖ నటుడు కన్నుమూత

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:44 AM GMT
అస్వస్థతతో ప్రముఖ నటుడు కన్నుమూత
X
బుల్లితెర నటుడు కమ్ వ్యాఖ్యతగా పలువురికి సుపరిచితుడు సంజీవ కులకర్ణి (49) తాజాగా కన్నుమూశారు. గడిచిన కొంతకాలంగా అస్వస్థత తో ఉన్న ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు. కన్నడ నటుడిగా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన.. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. కర్ణాటకలో ప్రముఖుడు.

కన్నడలో పేరొందిన సీరియల్స్ నాగిని..రాజారాణి.. ఏటు-ఏదురీటులో నటించారు. కొంతకాలంగా కార్డియోమయోపతితో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుమారుడు సౌరభ్ కులకర్ణి కూడా నటుడే.

పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య సమస్యలు ఒక కొలిక్కి రాలేదని చెబుతారు. సంభ్రమ- సౌరభ పేరుతో ప్రతి నెలా ఆయన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి మంచి పేరుంది. ఆయన మరణంపై సినీ.. టీవీ రంగానికి చెందిన పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పలువురు నివాళులు అర్పించారు.