Begin typing your search above and press return to search.
'సంజీవని' లఘు చిత్రానికి టాలీవుడ్ దర్శకుల ప్రశంసలు..!
By: Tupaki Desk | 21 July 2021 11:39 AM GMTడిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యంగ్ స్టర్స్ కి అవకాశాలకు కొదువ లేకుండా పోయింది. కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఒప్పించగలిగే కొత్త కాన్సెప్ట్ లను ఎంచుకొని.. లఘు చిత్రాలుగా మలిచి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో కొందరు సామాజిక అంశాలను కథాంశాలుగా తీసుకొని చిత్రాలుగా రూపొందిస్తుంటే.. మరికొందరు కమర్షియల్ - అడల్ట్ కంటెంట్ తో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని లఘు చిత్రాలు జాతీయ స్థాయిలో - ఇంటర్నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చుకొని.. ఎన్నో అవార్డులు అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో ''సంజీవని'' షార్ట్ ఫిలిం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
'మన తాత్కాలిక జీవితాలకు శాశ్వత విలువలు అందించే కథ' అంటూ సందేశాత్మక అంశాలతో రూపొందిన ''సంజీవని'' చిత్రాన్ని మహేష్ వివాజియన్ తెరకెక్కించారు. గోనె శ్రీనివాసులు ఈ లఘు చిత్రానికి స్టోరీ - స్క్రీన్ ప్లే అందించగా.. రేఖా శ్రీనివాసులు దీన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా అవయవదానం గురించి.. దాని అవసరం గురించి చక్కని సందేశాన్ని అందించారు. మనిషి మరణించిన తర్వాత కూడా అవయదానం వల్ల బ్రతికే ఉంటారని.. ఆ విధంగా ఇతరులకు సహాయపడగలడని.. కానీ అలాంటి మనిషి శరీరాన్ని భూమిలో పాతి పెట్టడమో? దహనం చేయడమో సరైంది కాదని ఈ షార్ట్ ఫిలిం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
అవయవదానం గురించి తెలియజెప్పే ''సంజీవని'' షార్ట్ ఫిలిం పలు అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లలో ప్రదర్శించడమే కాకుండా.. ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ - వేణు ఊడుగుల కూడా ఈ లఘు చిత్రాన్ని ప్రశంసించారు. ''పల్లెటూరి మనుషులు వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయి.. ఆ ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా చూపించారు. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ చాలా అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఫిలిం ఇది'' అని ఇంద్రగంటి మెచ్చుకున్నారు.
''#సంజీవని నేటి ప్రపంచానికి కన్ను తెరిపిస్తుంది. మహేష్ దర్శకత్వం వహించిన ఈ అవార్డు విన్నింగ్ లఘు చిత్రం చూసినందుకు సంతోషంగా ఉంది. ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ ఈ విలువైన కథను పూర్తి చేశాయి. ఇంత మంచి ప్రాజెక్ట్ అందించినందుకు మొత్తం బృందానికి అభినందనలు'' అని వేణు ఊడుగుల ప్రశంసించారు.
ఈ చిత్రానికి ప్రశాంత్ సంగీతం సమకూర్చగా.. శ్రవణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. బేబీ నియతి - జీవీ బాబు - ఆర్జే విక్కీ - శ్రీధర్ - ప్రభాకర్ - రాధమ్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు మహేష్ దీనికి డైలాగ్స్ తో పాటుగా పాటలు కూడా రాశారు. ఫీల్ గుడ్ ఎమోషనల్ షార్ట్ ఫిలిం ''సంజీవని'' ప్రస్తుతం MX ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతోంది.