Begin typing your search above and press return to search.
గ్రేట్ డైరెక్టర్.. మళ్లీ ప్రూవ్ చేశాడు
By: Tupaki Desk | 4 Aug 2018 8:09 AM GMTరాజ్ కుమార్ హిరాని పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు కళ్లు మూసుకుని సినిమాకు వెళ్లిపోతారు భారతీయ ప్రేక్షకులు. ఆయన ఎవరితో సినిమా తీసినా.. ఎలాంటి కథను ఎంచుకున్నా జనరంజకంగా మలచగలడన్న భరోసా ప్రేక్షకులది. అమీర్ ఖాన్‌తో వరుసగా రెండు రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు చేసిన ఆయన.. తాజాగా రణబీర్ లాంటి మీడియం రేంజ్ హీరోతోనూ ‘సంజు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు. హీరో ఎవరైనా తన రేంజ్ తనదే అని హిరాని రుజువు చేశాడు. ఈ సినిమా అనూహ్యంగా ఇండియన్ ఆల్ టైం బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం అమీర్ ఖాన్ తో హిరాని తీసిన ‘పీకే’ రికార్డును బద్దలు కొట్టింది. ఇండియాలో ‘పీకే’ ఆ చిత్రం రూ.340 కోట్లు వసూలు చేయగా.. దాన్ని ‘సంజు’ దాటేయడం విశేషం.
ఐదో వారాంతం తర్వాత ఇండియాలో ‘సంజు’ వసూళ్లు రూ.341 కోట్లను దాటాయి. ఇండియాలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్లలో ‘సంజు’ స్థానం మూడు కావడం విశేషం. ‘బాహుబలి: ది కంక్లూజన్’.. ‘దంగల్’ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఐదో వారంలోనూ ‘సంజు’ రూ.4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇండియాలో. ఓవైపు ఈ వారం విడుదలైన ‘ముల్క్’.. ‘ఫన్నే ఖాన్’ పేలవమైన ఓపెనింగ్స్ సాధించగా.. ‘సంజు’ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపిస్తుండటం విశేషమే. ఈ చిత్రం తొలి వారంలోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ‘సంజు’ రూ.500 కోట్ల మార్కును దాటేసింది. చాలా తక్కువ సినిమాలతోనే గ్రేట్ డైరెక్టర్ అనిపించుకున్న హిరాని.. ‘సంజు’తో తనేంటో మరోసారి రుజువు చేసుకున్నాడు. ఈ దశలో ఆయన అమీర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ తో ఒక మంచి సినిమా తీస్తే వసూళ్ల మోత మామూలుగా ఉండదేమో.