Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ పై బాలీవుడ్ జులుం

By:  Tupaki Desk   |   30 Jun 2018 3:46 PM GMT
టాలీవుడ్‌ పై బాలీవుడ్ జులుం
X
ఈ శుక్రవారం ఏకంగా ఏడు తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో విడుదలకు ముందు హైప్ తెచ్చుకున్న సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ మాత్రమే. ఈ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది. దీనికి తోడు ప్రి రిలీజ్ స్పెషల్ ప్రివ్యూకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. నిజానికి అందరూ అన్నంత స్థాయిలో ఈ సినిమా లేదు. అర్బన్ యూత్‌ కు మాత్రమే కనెక్టయ్యేలా ఉందీ చిత్రం. ఐతే ముందున్న హైప్ వల్ల దీనికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. వీకెండ్ వరకు సినిమా జోరు చూపించేలా ఉంది. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. కానీ మిగతా ఆరు సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. షకలక శంకర్ సినిమా సగటు మాస్ మసాలా టైపే అంటున్నారు. శంకర్ బాగానే చేసినా.. సినిమాకు ఆశించిన టాక్ రాలేదు.

మిగతా సినిమాల గురించి డిస్కషనే లేదసలు. అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన సాహసోపేత ప్రయత్నం ‘సంజీవని’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవంటున్నారు. తక్కువ ఖర్చులో గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ బాగానే చేశారంటున్నారు తప్ప కథాకథనాల్ల అయితే ఏ విశేషాలు లేవంటున్నారు. ఇక ‘సూపర్ స్కెచ్’ అని.. ‘నా లవ్ స్టోరీ’ అని.. ‘కన్నుల్లో నీ రూపమే’ అని ఇంకో మూడు నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వీటి గురించి చర్చే లేదు. నిజానికి తెలుగు సినిమాల కంటే కూడా తెలుగు రాష్ట్రాల్లో ఓ హిందీ సినిమా మీదే ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ‘సంజు’ తెలుగు రాష్ట్రాల్లోని సిటీల్లో తొలి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగాయి. సినిమాకు టాక్ కూడా అదిరిపోవడంతో ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించేలా ఉంది. ఇదే వీకెండ్ బాక్సాఫీస్ లీడర్ అయ్యేలా ఉంది.