Begin typing your search above and press return to search.

ట్రైన్ మిస్సవ్వడంతో ఘాజీ దొరికింది

By:  Tupaki Desk   |   15 Feb 2017 4:26 AM GMT
ట్రైన్ మిస్సవ్వడంతో ఘాజీ దొరికింది
X
సంకల్పం ఉంటే ఏదైనా సాధించచ్చు అని.. మురారి మూవీలో మహేష్ చెబుతాడు. బహుశా సంకల్ప్ రెడ్డికి తన పేరులోనే సంకల్పం ఉండడంతో.. ఘాజీ కోసం గట్టిగానే సంకల్పించాడు. అందుకే ఈ నెల 17న రిలీజ్ కానున్న ఘాజీ మూవీ కోసం.. ఇండియన్ ఆడియన్స్ ప్రస్తుతం ఇండియా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా మూడు భాషల్లో 3500 స్క్రీన్స్ లో రిలీజ్ కానున్న ఘాజీ.. ఇండియన్ మూవీస్ లో సెన్సేషన్ గా నిలుస్తుందని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. తొలిసారిగా ఓ సబ్ మెరైన్ థీమ్ తో తెరకెక్కడం.. ఇప్పటివరకూ చూపించిన ప్రతీ విజువల్ అద్భుతంగా ఉండడంతో.. ఆసక్తి మరింతగా పెరిగిపోయింది.

అసలు ఈ సినిమాని.. జస్ట్ యూట్యూబ్ లో రిలీజ్ లో చేసేందుకు గాను ఓ చిన్న సినిమాగా మొదలుపెట్టారని తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. కానీ కొత్త కుర్రాడు కం దర్శకుడు అయిన సంకల్ప్ రెడ్డి ఈ ప్రయాణాన్ని డీటైల్డ్ గా చెప్పడానికి ఏ మాత్రం మొహమాటపడ్డం లేదు. 'నవంబర్ 23.. 2012న వైజాగ్ నుంచి అన్నవరం వెళ్లాల్సిన ట్రైన్ మిస్ అయింది. అపుడు తొలసారిగా ఘాజీ సబ్ మెరైన్ చూశాను. విపరీతమైన ఆసక్తి కలిగి ఆ తర్వాత పది నెలల పాటు కేవలం PNS Ghazi పై రీసెర్చ్ చేశాను. అనేకమంది టెక్నీషియన్స్ ను.. నేవీ ఆఫీసర్స్ ను మీట్ అయ్యాను' అని చెప్పాడు సంకల్ప్ రెడ్డి.

1000 ఫోటోలు.. మీనియేచర్ సబ్మెరైన్ మోడల్స్ తో పాటు చాలా ప్రొడక్షన్ మెటీరియల్ సిద్ధం చేసుకున్నాడట. ఇదంతా చేయడానికి 25 లక్షలు ఖర్చు చేయడం తన స్థాయికి మించినదే అయినా ఏ మాత్రం వెనకాడలేదన్నాడు సంకల్ప్. ఆ తర్వాత మ్యాటినీ ఎంటర్టెయిన్మెంట్స్ కు చెందిన నిరంజన్ రెడ్డిని కలవడం.. ఆయన పీవీపీ దగ్గరకు తీసుకెళ్లడం.. అలా ఓ భారీ చిత్రం రూపొందడానికి నాంది పలకడం జరిగాయని చెబుతున్నాడు.

ఇప్పుడు ఘాజీ పేరు చెబితే.. దగ్గుబాటి రానా.. తాప్సీ.. పొట్లూరి వర ప్రసాద్.. కరణ్ జోహార్.. ఇలా ఇన్ని బడా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇది కేవలం ఓ యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన చిన్న ప్రాజెక్ట్ అని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంత సాధించడానికి కారణం.. సంకల్ప్ రెడ్డి సంకల్పమే కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/