Begin typing your search above and press return to search.

రెండు హిందీ సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడట

By:  Tupaki Desk   |   15 Dec 2018 6:34 AM GMT
రెండు హిందీ సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడట
X
‘ఘాజీ’ లాంటి సెన్సేషనల్ మూవీ తో దర్శకుడి గా పరిచయం అయ్యాడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం కేవలం తెలుగు వాళ్లనే కాదు.. తమిళ, హిందీ ప్రేక్షకుల్ని కూడా మెస్మరైజ్ చేసింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. జాతీయ అవార్డు కూడా సాధించింది. తొలి ప్రయత్నంలోనే ఇలాంటి సాహసోపేత సినిమా తీసి మెప్పించడమంటే చిన్న విషయం కాదు. రెండో ప్రయత్నంలోనూ అతను అలాంటి సాహసమే చేస్తున్నాడు. స్పేస్ నేపథ్యం లో ‘అంతరిక్షం’ అనే సినిమా తీశాడు. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ చూసి ప్రేక్షకులు స్టన్ అయిపోయారు. హాలీవుడ్లో వచ్చిన స్పేస్ సినిమాల్ని గుర్తుకు తెస్తోందీ చిత్రం. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడితే దేశవ్యాప్తంగా సంకల్ప్ పేరు మార్మోగడం ఖాయం. అప్పుడతడికి బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.

ఐతే ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్ నుంచి పిలుపు అందుకున్నాడట సంకల్ప్. ‘ఘాజీ’ సినిమా చూసి ఇంప్రెస్ అయి.. అతడి కి ఆల్రెడీ రెండు ఆఫర్లు ఇచ్చారట. వాటికి సూచన ప్రాయంగా అంగీకారం కూడా తెలిపాడట సంకల్ప్. ఐతే తన రెండో సినిమాను కూడా తెలుగులోనే చేయాలని భావించి ‘అంతరిక్షం’ ఇక్కడే చేశానన్నాడు. హిందీ లో తప్పకుండా సినిమాలు చేస్తానని చెప్పాడు సంకల్ప్. ఒక పత్రికలో చదివిన స్పేస్ ఆర్టికల్ చదివి ‘అంతరిక్షం’ సినిమా తీయడానికి స్ఫూర్తి పొందానన్నాడు. స్పేస్ సినిమా అని తప్పితే హాలీవుడ్లో వచ్చిన ‘గ్రావిటీ’.. ‘ఇంటర్ స్టెల్లార్’లతో ‘అంతరిక్షం’కు పోలిక ఉండదని సంకల్ప్ తెలిపాడు. కానీ వాటి నుంచి తాను ఇన్ స్పైర్ అయిన మాట వాస్తవమన్నాడు. వరుణ్ తేజ్.. అదితి రావు హైదరి.. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ‘అంతరిక్షం’ ఈ నెల 21నే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.