Begin typing your search above and press return to search.
మెగా హీరోతో సైన్స్ ఫిక్షన్ మూవి
By: Tupaki Desk | 17 May 2017 6:15 AM GMTమిస్టర్ మూవీతో మంచి కామెడీ టైమింగ్ చూపించినా.. వరుణ్ తేజ్ కు ఆశించిన సక్సెస్ దక్కలేదు. వసూళ్లు బాగానే వచ్చినా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ఫిదా షూటింగ్ చేస్తున్న వరుణ్ తేజ్.. మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఘాజీ చిత్రంతో తన మార్క్ చూపించి యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తొలి చిత్రంతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు మెగా హీరోతో మూవీ ఓకే చేసుకున్నాడు. రెగ్యులర్ కథాంశం మాదిరిగా కాకుండా.. ఇది కూడా తన స్టైల్ లోనే గ్రాఫిక్స్ బేస్డ్ గానే సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు సంకల్ప్ రెడ్డి. వరుణ్ తేజ్ హీరోగా ఓ సైన్స్ ఫిక్షన్ కథను రూపొందించనున్నాడు. ఇందుకోసం గ్రాఫిక్స్ చాలానే అవసరం అవుతాయట. అలాగే.. ఖర్చు విషయంలోను.. టైం విషయంలోను ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా.. తాను మెచ్చే ఔట్ పుట్ వచ్చే వరకు కష్టపడేందుకు అనుమతి పొందినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి స్టోరీ ఫైనలైజేషన్ లో ఉండగా.. వరుణ్ తేజ్ ఫిదా చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. దీని తర్వాత వెంకీ అట్లూరితో ఓ మూవీ ప్రారంభించనున్న వరుణ్ తేజ్.. అది పూర్తి కాగానే సంకల్ప్ రెడ్డి చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/