Begin typing your search above and press return to search.
సంక్రాంతి 2022 బరిలో పందెం పుంజులు 350
By: Tupaki Desk | 8 July 2021 6:04 AM GMTప్రతిసారీ సంక్రాంతి బరిలో సుమారు నాలుగైదు చిత్రాలు రిలీజవుతున్నాయి. కరోనా మహమ్మారీ స్పీడ్ తగ్గాక 2021 సంక్రాంతి- జనవరి మాసంలో ఐదు చిత్రాలు రిలీజయ్యాయి. ఇవన్నీ మంచి రిజల్ట్ నే అందుకున్నాయి.
2021 ఘనమైన ఆరంభం `క్రాక్` మూవీతో సాధ్యమైంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమా 50శాతం ఆక్యుపెన్సీతో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించడం ఆశ్చర్యపరిచింది. అయితే సంక్రాంతి బరిలో రిలీజైన ఇతర సినిమాల్లో అనువాద చిత్రం మాస్టర్ తెలుగు క్రిటిక్స్ ప్రశంసలు అందుకోలేకపోయింది. కలెక్షన్లు యావరేజ్ అన్న టాక్ వినిపించింది. రామ్ నటించిన రెడ్ సంక్రాంతి బరిలోనే రిలీజై ఆశించిన ఫలితం అందుకోవడంలో తడబడింది. అయితే కరోనా భయాల నడుమ కూడా సంక్రాంతి సినిమాల వీక్షణకు జనం థియేటర్లకు రావడం ఉత్సాహం పెంచింది.
అయితే 2022 సంక్రాంతి సన్నివేశం ఎలా ఉండనుంది? అంటే ఇకపై థర్డ్ వేవ్ డిసైడ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సెకండ్ వేవ్ ఉధృతిని నియంత్రించిన అనంతరం తిరిగి జనం యథావిధిగా రోడ్లపైకి వచ్చి మాస్క్ నియమం మర్చిపోతున్నారు. శానిటైజర్ ముట్టడం లేదు. పర్యవసానంగా థర్డ్ వేవ్ ఎలా ఉంటుందో ఊహిస్తున్నారు.
ప్రస్తుతం థియేటర్లు తిరిగి తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సన్నాహకాల్లో ఉన్నారా? అంటే ఇంకా క్లారిటీ రావడం లేదు. తెలంగాణలో వందశాతం ఆంధ్రాలో యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవడం గురించి చర్చ సాగుతోంది. థియేటర్ల రంగానికి సంబంధించిన చాలా సందిగ్ధతలు ఇంకా అలానే వెంటాడుతున్నాయి. మరోవైపు రిలీజ్ కి రావాల్సిన క్రేజీ సినిమాలన్నీ ఇంకా తేదీని లాక్ చేయలేక సతమతమవుతున్నాయి. ఆచార్య- రాధే శ్యామ్, కెజిఎఫ్: చాప్టర్ 2- పుష్ప-అఖండ లాంటి భారీ చిత్రాలు ఈ ఏడాది తెరపైకి రానున్నాయి. ముగ్గురు పెద్ద స్టార్లు నటించిన సినిమాలు ఇప్పటికే సంక్రాంతి 2022 బరిలో ఖాయమైనట్టేనని చెబుతున్నారు. మరో మూడు నాలుగు క్రేజీ చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో వచ్చే వీలుందని అంచనా.
సూపర్ స్టార్ మహేష్ .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ .. ప్రభాస్ లాంటి స్టార్ల సినిమాలు 2022 సంక్రాంతి రేసులో ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహేష్ హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కార్ వారి పాట వచ్చే సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతుందని ఇంతకుముందే వెల్లడైంది. జనవరిలో సౌకర్యవంతమైన రిలీజ్ తేదీని లాక్ చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోందట.
అలాగే పవన్ కల్యాణ్ - రానా కథానాయకులుగా నటిస్తున్న `అయ్యప్పనమ్ కోషియం` రీమేక్ సంక్రాంతి బరిలోనే రిలీజ్ కి వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. అలాగే వెంకటేష్- వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సంక్రాంతి 2022 కానుకగా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎఫ్ 2 సీక్వెల్ కథ కాకుండా కొత్త కథతో ఎమోషనల్ ఎంటర్ టైనర్ ని రావిపూడి తెరకెక్కిస్తున్నామని తెలిపారు. మరోవైపు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఏదో ఒకటి సంక్రాంతి 2022 బరిలో దిగుతుందని అభిమానులు భావిస్తున్నారు. రాధేశ్యామ్ ఈ ఏడాదిలో రిలీజైపోతుంది. ఆదిపురుష్ 3డి.. సలార్ చిత్రాల్లో ఏ సినిమా 2022 సంక్రాంతి నాటికి రెడీ అవుతుంది అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 2022 సంక్రాంతికి అరడజను మంది రేసులో ఉన్నా ఆశ్చర్యం అక్కర్లేదని అంటున్నారు.
అయితే కరోనా థర్డ్ వేవ్ దేనినైనా మార్చేస్తుంది. ముందస్తు ప్రణాళికల్ని నాశనం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం అంతా స్థబ్ధుగా ఉంది. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.