Begin typing your search above and press return to search.
2023 సంక్రాంతి సినిమాలు.. మొత్తం 600 కోట్లు!
By: Tupaki Desk | 18 Jan 2023 9:24 AM GMTసౌత్ సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండగ అనేది ఒక ప్రత్యేకమైన బాక్స్ ఆఫీస్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. ఈ పండుగ సీజన్లో స్టార్ హీరోలు సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడుతూ ఉంటాయి. కాస్త పాజిటివ్ వచ్చిన కూడా అన్ని సినిమాలు పోటాపోటీగా కలెక్షన్స్ అందుకుంటు ఉంటాయి. ఇక ఈసారి తెలుగు తమిళంలో కూడా ఇద్దరు అగ్ర హీరోలు పోటీ పడడం విశేషం.
ముఖ్యంగా తెలుగులో అయితే గతంలో ఎప్పుడు లేనివిధంగా ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు సినిమాలు రావడం విశేషం అని చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ఒకరోజు గ్యాప్ లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇక వీర సింహారెడ్డి సినిమా ఆరు రోజుల్లో 109 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా 144 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళంలో కూడా అజిత్ విజయ్ సినిమాలు భారీగానే పోటీ పడ్డాయి. ముఖ్యంగా వారిసు సినిమా ఏడు రోజుల్లో తెలుగు తమిళంలో కలిపి 213 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
ఇక మరోవైపు అజిత్ తునివు/తెగింపు సినిమా కూడా తెలుగు తమిళంలో ఏడు రోజుల్లో 149.66 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. ఈ రెండు సినిమాల మధ్యలో పోటీ అయితే గట్టిగానే జరిగింది. ఇక మొత్తంగా మొదటి వారంలో ఈ నాలుగు సినిమాల గ్రాస్ కలెక్షన్స్ అయితే 616.71 కోట్ల వరకు నమోదైనట్లు సమాచారం.
ఇక ఈ సంక్రాంతి ఫెస్టివల్ లో నాలుగు సినిమాలకు కలిపి 335 కోట్ల షేర్ అయితే వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంక్రాంతికి సౌత్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. మరి రాబోయే సమ్మర్ హాలిడేస్ ను మిగతా సినిమాలు ఏ విధంగా ఉపయోగించుకుంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.