Begin typing your search above and press return to search.

పొంగల్ పోటీలో విజేత ఎవరంటే..

By:  Tupaki Desk   |   19 Jan 2016 10:30 PM GMT
పొంగల్ పోటీలో విజేత ఎవరంటే..
X
సంక్రాంతి పండుగకు నాలుగు సినిమాలు పోటీలో నిలిచాయి. వీటిలో దేనికదే విభిన్నమైన జోనర్ కావడంతో.. నాలుగు మూవీస్ కి హిట్ టాక్ వచ్చింది. అన్నింటికీ కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. మౌత్ టాక్ కూడా నాలుగు సినిమాలకు బాగుంది. మరి సంక్రాంతి రేస్ లో విజేత ఎవరు అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

భారీ చిత్రాలైన యంగ్ టైగర్ నాన్నకు ప్రేమతో - బాలయ్య డిక్టేటర్ లు.. జనవరి 13 న - 14న రిలీజ్ అయ్యాయి. వీటి తర్వాత వచ్చింది నాగ్ నటించిన సోగ్గాడే చిన్ని నాయన. నాన్నకు ప్రేమతో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవాలంటే కనీసం 55 కోట్లు రాబట్టాల్సిందే. అప్పటివరకూ ఎక్కువ వసూళ్లు వచ్చినా హిట్ అని చెప్పలేం. తొలి వీకెండ్‌ పూర్తయ్యే నాటికి.. ప్రపంచవ్యాప్తంగా 38.5+ కోట్లు షేర్‌ రాబట్టింది నాన్నకు ప్రేమతో. అయితే సోమవారం నుండి థియేటర్ల సంఖ్య బాగా తగ్గింది. కాబట్టి మండే నుండి మూడ్‌ ఎలా ఉందో చూడాలి. ఇక బాలయ్య డిక్టేటర్ బీ - సీ సెంటర్లలో ఇరగదీసి ఆడేస్తోంది. ఇప్పటికే మొదటి వీకెండ్‌ లో 13.3+ కోట్ల షేర్‌ కలెక్షన్స్ వచ్చినా ఇంకా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాలేదు. శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా లోబడ్జెట్ మూవీ కావడంతో ఇప్పటికే 5 కోట్లు షేర్‌ వచ్చేసింది. మరో వారంలో లాభాల్లోకి వచ్చేయనుండటం విశేషం.

సోగ్గాడే చిన్ని నాయన ఓవర్సీస్ తో కలిపి మొత్తం 450 థియేటర్లలో రిలీజ్ అయింది. అన్ని చోట్లా హౌజ్ ఫుల్స్ కారణంగా.. ఇప్పుడు స్క్రీన్ ల సంఖ్యను 600కు పెంచాల్సి వస్తోంది. అయితే మొదటి వారాంతంలోనే సినిమాకు 13.8+ కోట్ల షేర్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని చాలా ప్రాంతాల్లో నాగ్ ఎవరికీ అమ్మలేదు. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో సొంతగానే రిలీజ్ చేసుకున్నాడు. కలెక్షన్స్ కూడా తొలిరోజుకు ధీటుగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. అన్ని విధాలుగా నాగ్‌ కు అలా ప్లస్‌ అయ్యింది.

ఓవరాల్‌ గా వీళ్లలో విజేత ఎవరో చెప్పాలంటే.. కలెక్షన్ల బట్టి చూస్తే.. ముందు నాగార్జున దూసుకొస్తాడు. అయితే మరో వారం ఆడేస్తే.. అన్ని సినిమాలూ బాగానే గట్టెక్కేశేలా ఉన్నాయి. సో.. అందరూ హీరోలే!!