Begin typing your search above and press return to search.
సంక్రాంతి పోరు.. విజేత ఎవరంటే?
By: Tupaki Desk | 13 Jan 2023 4:30 PM GMTసంక్రాంతి రేసులో రిలీజ్ అయితే మినిమమ్ ఎవరేజ్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకోవచ్చు అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. ఇక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఈ నేపధ్యంలో ఈ సారి కూడా సంక్రాంతి రేసులో టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ మరోసారి పోటీ పడ్డారు.
వీరిద్దరూ ఇప్పటి వరకు 33 సార్లు సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. మరోసారి వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి రేసులో పోటీ పడ్డారు. ఇదే సమయంలో కోలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా లెవల్ లో తమ సినిమాలని రిలీజ్ చేశారు. ఇళయదళపతి విజయ్ వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. అలాగే తెగింపు సినిమాతో అజిత్ కూడా పోటీలోకి వచ్చాడు.
ఈ ఇద్దరు హీరోల మధ్య కోలీవుడ్ లో మంచి పోటీ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే కోలీవుడ్ లో తెగింపు, వారసుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు ప్రేక్షకుల నుంచి ఎవరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇక తెగింపు తెలుగులో రిలీజ్ అయ్యి ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇద్దరు మెగాస్టార్, బాలకృష్ణ రంగంలోకి దిగడంతో తెలుగు ప్రేక్షకులు అజిత్ సినిమా వైపు చూసే పరిస్థితి లేదు. ఇక వీరసింహారెడ్డి 11న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
మాస్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ఈ మూవీ నందమూరి అభిమానులకి భాగానే కనెక్ట్ అయిన కామన్ ఆడియన్స్ కి మాత్రం అనుకున్న స్థాయిలో రీచ్ కాలేదు. ఓ విధంగా చెప్పాలంటే ఎవరేజ్ టాక్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది.
ఇక వాల్తేర్ వీరయ్య సినిమా కూడా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వాల్తేర్ వీరయ్య బెటర్ అనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇక విజయ్ వారసుడు సినిమా తమిళంలో రిలీజ్ అయ్యి ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న నేపధ్యంలో తెలుగులో కూడా అదే టాక్ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.
ఇలా సంక్రాంతి రేసులో పోటీ పడుతున్న ఇద్దరు కోలీవుడ్ స్టార్స్, ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ సినిమాలు ఎవరేజ్ టాక్ ప్రేక్షకుల నుంచి తెచ్చుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడి ఎక్కువ కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది. కోలీవుడ్ స్టార్స్ సినిమాలకి తెలుగులో మెగాస్టార్, బాలయ్య స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే లేదు. ఈ నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ విన్నర్ గా చిరంజీవి, బాలయ్యలో ఎవరో ఒకరే నిలిచే అవకాశం ఉంది. ప్రేక్షకులు ఆ అవకాశం ఎవరికి ఇస్తారనేది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.