Begin typing your search above and press return to search.

సంక్రాంతి బిజినెస్ 700 కోట్లు దాటిందా?

By:  Tupaki Desk   |   31 Aug 2022 10:30 AM GMT
సంక్రాంతి బిజినెస్ 700 కోట్లు దాటిందా?
X
సంక్రాంతి సీజ‌న్ అంటే సినిమా రిలీజ్ కి స‌రైన వేదిక‌. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్నా సునాయాసంగా కోట్ల వ‌ర్షం కురుస్తుంది. ఇక హిట్..బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వ‌ద్ద ఆ చిత్రాల వేగాన్ని ఆప‌డం ఎవ‌రి త‌రం. బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్ల వ‌సూళ్ల సునామీ కొన‌సాగుతూనే ఉంటుంది. అందుకే స్టార్ హీరోల చిత్రాలు ఎక్క‌వ‌గా సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు.

ఆ స‌మీక‌ర‌ణాల ప్రకార‌మే వాటి ప్రీ రిలీజ్ బిజినెస కూడా పెద్ద ఎత్తున జ‌రుగుతుంటుంది. ఇప్ప‌టికే సంక్రాంతి బెర్తుల్ని మెగాస్టార్ చిరంజీవి..పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్...కోలీవుడ్ సంచ‌ల‌నం ఇల‌య‌త‌ల‌ప‌తి విజ‌య్ క‌న్ప‌మ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ వ‌రుస‌లో ఇంకా చాలా మంది హీరోలు చేరే అవ‌కాశం ఉంది. సీజ‌న్ కి ఇంకా నాలుగు నెల‌లు స‌మ‌యం ఉంది కాబ‌ట్టి మ‌రిన్ని చిత్రాలు రేసులో కి వ‌స్తాయి.

దీంతో వ‌చ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌ద్ద వార్ గ‌ట్టిగానే క‌నిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 154వ చిత్రం 'వాల్తేరు వీర‌య్య‌'ని జ‌న‌వ‌రి 10 నుంచి 15 లోపు ఏతేదీనైనా రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని సంకేతాలిచ్చేసారు. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న‌ ఈ మాస్ ఎంట‌ర్ టైనర్ పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. చిరంజీవి మాస్ చిత్రం చేసి చాలా కాల‌మ‌వ్వ‌డంతో అభిమానులు వీర‌య్య కోస ఎంతో ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు.

ఇక పాన్ ఇండియాస్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'అదిపురుష్' జ‌న‌వ‌రి 12 న రిలీజ్ చే స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అవుతోన్న సినిమా ఇది. ప్ర‌చార చిత్రాలు రిలీజ్ కాకుండా ఆది పురుష్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసే సినిమా అవుతుందంటూ అభిమ‌నులు జోస్యం చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో చిరంజీవి...ప్ర‌భాస్ కి పోటీగా ఇల‌య‌త‌ల‌ప‌తి విజ‌య్ దిగుతున్నాడు. ఆయ‌న హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న‌ వార‌సుడు ని కూడా సంక్రాంతి కానుక‌గానే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్ప‌టివ‌ర‌కూ 700 కోట్ల‌కు పైగా జ‌రిగిన‌ట్లు ఊహాగానాలు వ‌స్తున్నాయి. 'ఆదిపురుష్' మిగ‌తా భాష‌ల్ని మిన‌హాయించి ఈ లెక్క‌ని తెరపైకి తీసుకొస్తున్నారు. రిలీజ్ కి ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి ఆ లెక్క‌లు మారే అవ‌కాశం ఉంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఆ సినిమాల‌ బిజినెస్ స్పాన్ పెరిగే ఛాన్స్ ఉంది. వాటి స‌ర‌స‌న కొత్త చిత్రాలు వ‌చ్చి చేర‌తాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.