Begin typing your search above and press return to search.
పేరులో ఆ మార్పు ఇద్దరు డైరెక్టర్ దశ మార్చేనా?
By: Tupaki Desk | 24 Nov 2022 1:30 PM GMTసినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలకు, నమ్మకాలకు పెద్ద పీట వేస్తుంటారన్నది తెలిసిందే. సినిమా ప్రకటన.. ముహూర్తం దగ్గరి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ..ఆ తరువాత రిలీజ్ డేట్.. టైమ్ గంటలు.. నిమిషాలని కూడా ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇక ప్యూమరాలజీ గురంచి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా వరకు స్టార్స్ న్యూమరాలజీ ప్రకారం సొంత పేర్లని పక్కన పెట్టి కొత్త పేర్లతో ఇండస్ట్రీలో స్టార్ లు గా రాణించిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంటి తదతర హీరోల అసలు పేర్లు వేరే..న్యూమరాలజీని బట్టి వీరి పేర్లని మార్చుకున్నారు. స్టార్ లుగా వెలుగుతున్నారు. ఇలాంటి నమ్మకమే ఇప్పడు దర్శకుల్లోనూ రోజు రోజుకూ పెరిగిపోతోంది. త్రివిక్రమ్ అసలు పేరకు ఆకెళ్ల నాగశ్రీనివాస శర్మ.. అయితే తన పేరుని త్రివిక్రమ్ గా మార్చుకున్న తరువాతే స్టార్ డమ్ మొదలైంది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు.
ఇదే తరహాలో కొంత మంది దర్శకులు కూడా తమ పేర్లని మార్చుకునే పనిలో పడ్డారు. అయితే త్రివిక్రమ్ లా పూర్తిగా మార్చుకోకుండా తమ పేరులో వున్న ఇంగ్లీష్ అక్షరాలని మాత్రమే మార్చుకోవడం విశేషం. 'క్రాక్' సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'వీర సింహారెడ్డి' మూవీని తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ వారు నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో దిగుతోంది.
ఈ మూవీ కోసం గోపీచంద్ తన పేరు చివరలో 'హెచ్' అనే అక్షరాన్ని చేర్చుకున్నాడు. సంక్ష్యా శాస్త్రం ప్రకారం ఈ మార్పు చేసుకున్నాడట. కారణం 'క్రాక్' సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ 'వీర సింహారెడ్డి' కూడా తనకు బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాలని గోపీచంద్ మలినేని బలంగా కోరుకుంటున్నాడట. ఆ కారణంగానే తన పేరు చివరలో 'హెచ్' అక్షరాన్ని చేర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ దర్శకుడి లాగే బాబి కూడా తన పేరు చివరన ఇంటి పేరుని కొత్తగా చేర్చుకున్నాడు.
ఇప్పటి వరకు బాబి (కె.ఎస్. రవీంద్ర) అంటూ టైటిల్స్ లో వేసుకున్న బాబి ఇప్పడు 'వాల్తేరు వీరయ్య' కోసం మాత్రం బాబి కొల్లి అంటూ తన ఇంటి పేరుని జత చేసుకోవడం విశేషం. సంక్రాంతి బరిలో చిరుతో చేస్తున్న 'వాల్తేరు వీరయ్య' కూడా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ ని ఆశిస్తున్నాడు బాబి. మరి న్యూమరాలజీ ప్రకారం పేరులో మార్పులు చేసుకున్న దర్శకుల దశ సంక్రాంతితో దిరిగేనా అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.