Begin typing your search above and press return to search.

సంక్రాంతి ఫైట్.. 4 సినిమాల రన్ టైమ్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   30 Dec 2022 9:30 AM GMT
సంక్రాంతి ఫైట్.. 4 సినిమాల రన్ టైమ్ ఎంతంటే?
X
2023 సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ ఊహించని రేంజ్ లో ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. దాదాపు అన్ని సినిమాలు కూడా ఒకే తరహా కమర్షియల్ పాయింట్స్ తో రాబోతున్నాయి. అయితే ఈ సినిమాలలో ఏ మూవీ అత్యధిక స్థాయిలో పాజిటివ్ టాక్ అందుకుంటుందో.. ఆ సినిమాకు ఈ ఫెస్టివల్ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మా సినిమానే సక్సెస్ అవుతుంది అని ఎవరికి వారు ప్రచారాలు అయితే ఎక్కువగానే చేస్తున్నారు.

ఇక ఈ సంక్రాంతి ఫైట్ లో ఏ సినిమా రన్ టైమ్ ఎంతసేపు ఉండనుంది అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా వారసుడు సినిమా తమిళంలో భారీ స్థాయిలో విడుదలవుతుండగా.. తెలుగులో కూడా విజయ్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమా 2 గంటల 43 నిమిషాల నిదివితో రానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక డిఫరెంట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే ఇక జనవరి 12వ తేదీన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉండబోతోంది.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక బాబీ దర్శకత్వంలో మైత్రి భూమి మేకర్స్ నిర్మించిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలుగా ఫిక్స్ అయ్యింది.

ఇక అజిత్ నటించిన తెగింపు సినిమాను తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా 2 గంటల 23 నిమిషాల నిడివితో రాబోతోంది. హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా నిర్మాత దిల్ రాజు నైజం అలాగే వైజాగ్ ఏరియాలలో తెగింపు సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.