Begin typing your search above and press return to search.

ఈ సంక్రాంతి అందరికీ కిక్కిచ్చింది

By:  Tupaki Desk   |   18 Jan 2016 4:19 AM GMT
ఈ సంక్రాంతి అందరికీ కిక్కిచ్చింది
X
మొత్తానికి ఇంగ్లీష్ సంవత్సరంలో తొలి తెలుగు పండుగ ఘనంగా పూర్తయింది. భోగి మంటలు - రంగవళ్ళులు - కోడి పందాలు - గాలిపటాలతో సంక్రాంతి మూడు రోజులు వైభవంగానే సాగింది. ఇక ఈ సమయంలో సినిమారంగంకూడా తమవంతు చేయుటగా ప్రేక్షకులకు నాలుగు సినిమాలు అందించింది. అయితే విశేషం ఏమిటంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి విడుదలైన అన్ని సినిమాలు మంచి టాక్ ని తెచ్చుకోవడమేకాక ప్రతీ సినిమా ఏదోక వర్గం ప్రేక్షకులను మెప్పించడం కొసమెరుపు.

పండుగ సందర్భంగా తొలుత విడుదలైన తారక్ నాన్నకు ప్రేమతో సినిమా ఇంటిలిజెన్స్ ని ఎమోషన్స్ ని సమపాళ్ళలో కలిపి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమా బి,సి సెంటర్ లలో కాస్త నిమ్మదించినా క్లాస్ మూవీలలో క్లాసిక్ గా వర్ణింపబడుతూ మల్టీప్లెక్స్ లలో, ఓవర్ సీస్ లో దుమ్ములేపుతుంది.

ఇక మాస్ ప్రియులకు పిండివంటలా బాలయ్య డిక్టేటర్ కడుపునింపింది. సినిమా ఆద్యంతం టిపికల్ బాలయ్య బాబు మూవీ ఫార్మాట్ లో నడిచినా, నందమూరి నట సింహం పవర్ ఫుల్ నటన - సోనాల్ అందచందాలు ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచి బి,సి ఆడియన్స్ ని మెప్పించాయి.

సినిమాల కలెక్షన్లను పెంచే యూత్ కి శర్వానంద్, మేర్లపాక గాంధీల కలయికలో ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం అలరించింది. సప్తగిరి కామెడి పండడంతో మరోసారి ఎంటర్టైనర్ సినిమాలకు గాంధీ కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచాడు. చివరిగా విడుదలైన సోగ్గాడే చిన్నినాయన సినిమా మాత్రం అందరి అంచనాలను తలదన్నేలా సూపర్ హిట్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూ సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొత్తానికి ఈ పండుగకి విడుదలైన సినిమాలు అన్ని వర్గాలను మెప్పించాయి.