Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాలకు బంపరాఫర్

By:  Tupaki Desk   |   18 Jan 2016 9:30 AM GMT
సంక్రాంతి సినిమాలకు బంపరాఫర్
X
సంక్రాంతి సినిమాల్లో ‘డిక్టేటర్’ మినహాయిస్తే మూడు సినిమాలూ యుఎస్ బాక్సాఫీస్ లో అదరగొడుతున్నాయి. అన్నింట్లోకి ఎన్టీఆర్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ అక్కడ ఇరగాడేస్తోంది. తొలి నాలుగు రోజుల్లోనే మిలియన్ మార్కును అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘నాన్నకు ప్రేమతో’. ఇక సంక్రాంతి రేసులో చివరగా వచ్చిన నాగార్జున సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’తో పాటు శర్వానంద్ మూవీ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ కూడా అక్కడ బాగానే ఆడుతున్నాయి. డిక్టేటర్ మాత్రం మొదట్నుంచి వెలవెలబోతోంది. ఐతే యుఎస్ లో జోరు చూపిస్తున్న తెలుగు సినిమాలకు వీకెండ్ తర్వాత కూడా ఓ అడ్వాంటేజీ లభించింది. జనవరి 18న సోమవారం కూడా అక్కడ సెలవు దినమే.

యుఎస్ లెజెండ్ మార్టిన్ లూథర్ కింగ్ జన్మదినం సందర్భంగా సోమవారం సెలవు ఇచ్చారు. దీంతో తెలుగు సినిమాలకు ఈ రోజు కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశముంది. మన దగ్గర కంటే యుఎస్ లో వీకెండ్ అన్నది చాలా ప్రభావం చూపిస్తుంది. అక్కడ వీక్ డేస్ లో తెలుగు జనాలు అస్సలు థియేటర్లకు రారు. షోలు కూడా బాగా తగ్గిపోతాయి. సెలవు రోజుల్లో మాత్రం టికెట్ ప్రైస్ పెంచి మరీ అదనపు షోలు వేస్తారు. కాబట్టి పాజిటివ్ టాక్ తో నడుస్తున్న నాన్నకు ప్రేమతో - ఎక్స్ ప్రెస్ రాజా - సోగ్గాడే చిన్నినాయనా సినిమాలకు ఇది మంచి అడ్వాంటేజే. అందులోనూ ‘నాన్నకు ప్రేమతో’కు ఇది బాగా కలిసొచ్చే అంశం. సంక్రాంతికి అన్నిటికంటే ముందు రేసులోకి దిగింది ఆ సినిమానే. ముందు రోజు ప్రిమియర్ షోలు కూడా కలిపితే ఇప్పటికే ఆరు రోజులు దంచుకుందీ సినిమా. ఇప్పుడు ఇంకో రోజు యాడ్ అయింది. ఇప్పటికే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఫుల్ రన్లో సినిమా రెండు మిలియన్ల దాకా కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి.