Begin typing your search above and press return to search.
సంక్రాంతి స్థాయి పెరిగింది
By: Tupaki Desk | 16 Jan 2017 5:30 PM GMTతెలుగునాట పెద్ద పండుగగా నిలిచే సంక్రాంతికి పందెపు కోళ్ళ మాదిరిగా సినిమాలు విడుదలచేయడం షరా మామూలే. అయితే ఓ రెండు మూడు సంవత్సరాల వరకూ సంక్రాంతికి తమ సినిమా విడుదల చెయ్యడమే టార్గెట్ గా పెట్టుకున్న చిత్ర సంస్థలు ఇప్పుడు సంక్రాంతికి ఒక మంచి సినిమా విడుదల చెయ్యాలని టార్గెట్ ని మార్చుకున్నారు.
గత ఏడాది సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలలో మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఈ ఏడాది విడుదలైన మూడు పెద్ద సినిమాలూ మంచి విజయాలే సాధించాయి. పూర్వంతో పోల్చుకుంటే హిట్ శాతం మరింత పెరిగినట్టే. ఏదొక సినిమా కాకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రాలు సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కథాకధానాలలో బలం లేకపోతే విడుదలైన రెండో రోజే థియేటర్ల షేర్ తగ్గిపోయి మంచి టాక్ అందుకున్న సినిమాల వైపు పరిగెత్తడం పెద్ద పనికాదుగాబట్టి తమ సినిమాలో విషయం వుండేలా జాగ్రత్త పడుతున్నారు. రానున్న సంక్రాంతికి ఈ పోటీ మరింత రసవత్తరంగా మారి బాలీవుడ్ లో దివాళీ, ఈద్ ల మాదిరి కాంపిటీషన్ ని తెలుగునాట కూడా తీసుకురావాలని కోరుకుందాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/