Begin typing your search above and press return to search.

మహేష్ అడ్డాలో సంక్రాంతి టాప్ సినిమాలు

By:  Tupaki Desk   |   20 Jan 2023 4:35 AM GMT
మహేష్ అడ్డాలో సంక్రాంతి టాప్ సినిమాలు
X
సూపర్ స్టార్ మహేష్ థియేటర్స్ బిజినెస్ లోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ థియేటర్స్ చాలా హై అండ్ లో నిర్మించారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లో ఉన్న ఎఎంబికి తెలుగు సినిమాల ద్వారా భాగానే ఆదాయం వస్తుందనే మాట వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఎఎంబి థియేటర్స్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే సంక్రాంతి బరిలో హైయెస్ట్ కలెక్షన్స్ చేసిన చిత్రాల జాబితాలో మొదటి రెండు స్థానాలలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఉండటం విశేషం.

సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ఎఎంబి థియేటర్స్ లో భారీ కలెక్షన్స్ ని రాబట్టాయి. దీనికి కారణం కూడా ఉంది. ఈ సినిమాలకి టికెట్ రెట్లు భారీగా పెంచారు. ఎఎంబి థియేటర్స్ సాధారణంగానే టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది 300, 400 ధరలలో ఉన్నాయి. గచ్చిబౌలీ లాంటి ఖరీదైన ప్రాంతంలో ఈ స్థాయిలో టికెట్ ధరలు పెద్ద ఎక్కువ అయితే కాదు.

ఈ నేపధ్యంలోనే వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు మంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా రెండు కూడా గట్టిగానే రాబట్టాయి. ఇక వీటి తర్వాత విజయ్ తమిళ్ మూవీ వారిసు, తెలుగు డబ్బింగ్ వెర్షన్ వారసుడు సినిమాలు కూడా ఎఎంబి సినిమాస్ లో కలెక్షన్స్ ని భాగానే రాబట్టాయి. ఇక వీటి తర్వాత ధమాకా సినిమా నిలిచింది. అయితే ధమాకా మూవీ డిసెంబర్ నెల ఆఖరులో రిలీజ్ కావడంతో కలెక్షన్స్ పరంగా తగ్గినా కూడా అజిత్ కుమార్ తెగింపు, తునివు సినిమా కంటే బెటర్ గా ధమాకా కలెక్షన్స్ ఉండటం గమనార్హం.

ఇక హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాలలో వాల్తేర్ వీరయ్య సినిమా ఉందంటే మెగాస్టార్ చిరంజీవి చరిష్మా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సరైన కథ పడితే చిరంజీవిని చూడటానికి మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా క్లాస్ ఆడియన్స్ కూడా క్యూ కడతారని ఎఎంబి సినిమాస్ లో వచ్చిన కలెక్షన్స్ చెబుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.