Begin typing your search above and press return to search.
షారుక్ కనిపిస్తే కాల్చి బూడిద చేస్తాడట!
By: Tupaki Desk | 21 Dec 2022 2:55 PM GMTబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ `పఠాన్` చుట్టూ రోజుకో వివాదం రాజుకుంటోంది. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా రూ. 250 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ చుట్టూ వివాదం అలుముకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా షారుక్, దీపికలపై చిత్రీకరించిన `బేషరమ్ రంగ్` అంటూ సాగే బీచ్ సాంగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పాటలో దీపిక పదుకునే టూపీస్ బికినీ ధరించి అంగాంగ ప్రదర్శన చేస్తూ చేయడంతో ఈ వీడియో పై వివాదం చెరేగింది. అంతే కాకుండా ఈ పాటలోని చివరి చరణాల్లో దీపిక కాషాయ రంగు బికినీ ధరించి కనిపించడం మరింతగా వివాదానికి ఆజ్యం పోసింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఆ పాటలో దీపిక ధరించిన డ్రెస్ లను సరి చేయాలని కొంత మంది.. లేదు లేదు `పఠాన్` మూవీని బ్యాన్ చేయాలని మరి కొంత మంది సినిమాపై మండిపడ్డారు.
మిందూ సంఘాలు చాలా వరకు `బేషరమ్ రంగ్` సాంగ్ పై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. షారుక్ సినిమాని బ్యాన్ చేయాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, శక్తిమాన్ నటుడు సైతం ఈ సాంగ్ పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ సాధువు షారుక్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అయోధ్యకు చెందిన సాధువు పరమ హంస్ ఆచార్య మాట్లాడుతూ షారుక్ ఖాన్ తన కంట పడితే అక్కడికక్కడే అతన్ని దహనం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అంతే కాకుండా `పఠాన్` సినిమాని ప్రదర్శిస్తే గనక ఆ థియేటర్లని కూడా తగలబెడతానని తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు. బేషరమ్ సాంగ్ లో కాషాయాన్ని అవమానించారని, `పఠాన్` సినిమాను బహిష్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందు ఇదే తరహాలో పలువురు సాధువులు `పఠాన్` సినిమాపై, దీపిక నటించిన పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ అయోధ్యకు చెందిన సాధువు పరమ హంస్ ఆచార్య తరహాలో మాత్రం స్పందించలేదు. మరి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి దుమారం రేగనుందో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.