Begin typing your search above and press return to search.
కామెడీ హీరోలు సెల్ఫ్ గోల్
By: Tupaki Desk | 9 Feb 2019 4:48 AM GMTకామెడీ హీరోలు యాక్షన్ హీరోలుగా మారడం కరెక్ట్ కాదా? కొత్తగా ట్రై చేస్తుంటే.. ఎందుకు తేడా కొడుతోంది? గత కొన్నేళ్లుగా ఈ కొత్త ట్రెండ్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. టాలీవుడ్ టాప్ కమెడియన్ సునీల్ హీరోగా ఫెయిలైనప్పటి నుంచి దీనిపై విశ్లేషణలు ఇంకా జోరందుకున్నాయి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా - కమెడియన్ గా కాల్షీటు(రోజు)కి రూ.3-5 లక్షలు అందుకున్న సునీల్ ఆ తర్వాత హీరో అయ్యి తనని తాను తగ్గించుకున్నాడన్న సూటి పోటి విమర్శలు ఉన్నాయి. ఏవో రెండు మూడు సినిమాలు హిట్టయ్యాయి. ఆ తర్వాత అన్నీ పరాజయాలే మిగిలాయి. ఆ ప్రభావంతో అతడికి ఇప్పుడు క్యారెక్టర్లు తగ్గిపోయాయి. కామెడీ రోల్స్ అసలే రావడం లేదన్న విమర్శ ఉంది. అయితే ఎవరు ఎలా మారినా ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి.
మరో కోణంలో చూస్తే అందని ద్రాక్ష లాంటి హీరోయిజాన్ని అందుకున్నాడు సునీల్. ఆ విషయంలో అతడిని మెచ్చుకోనివాళ్లు .. అతడి మహర్ధశను చూసి కుళ్లుకోని వాళ్లు లేకపోలేదు. ఇటీవల అల్లరి నరేష్ తో కలిసి సునీల్ నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అరవింద సమేత - అమర్ అక్బర్ ఆంటోని - పడి పడి లేచే మనసు చిత్రాల్లో నటించాడు. వీటిలో సునీల్ నటనకు గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సునీల్ సన్నివేశమేంటో తెలీదు ఇంకా. అయితే సునీల్ బాటలోనే వెళ్లి పలువురు కమెడియన్లు చేతులు కాల్చుకోవడం పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు పొరుగున ఉన్న కోలీవుడ్ - శాండల్ వుడ్ లోనూ కమెడియన్లు సీరియస్ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ అభిమానుల నుంచి తిరస్కారానికి గురవుతున్నారు.
తెలుగులో సునీల్ తర్వాత సప్తగిరి యాక్షన్ బాట పట్టడంపైనా ఆసక్తికర చర్చ సాగింది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ - సప్తగిరి ఎల్ ఎల్ బి చిత్రాలతో అతడు ప్రతికూల ఫలితాల్ని అందుకున్నాడు. హీరోగా వ్యామోహం తగ్గలేదన్న విమర్శలు వచ్చినా అతడు మరోసారి `వజ్ర కవచధర గోవింద` అంటూ కాస్తంత ఫోర్స్ గానే బరిలోకి దిగుతున్నాడు. అయితే కామెడీతో యాక్షన్ సరిగా బ్లెండ్ కాకపోతే వచ్చే ముప్పును సప్తగిరి ఇదివరకూ ఎదుర్కొన్నాడు. ఈసారి ఏం చేస్తాడో? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు జబర్ధస్త్ తో ఫేమస్ అయిన షకలక శంకర్ `శంభో శంకర` చిత్రంతో హీరో అయ్యాడు. వస్తూనే భారీ పంచ్ డైలాగులు, యాక్షన్ తో తుక్కు రేగ్గొట్టినా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఫ్లాపైంది. అయినా అతడు హీరోగా రాణించే పట్టుదలతో ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు. అతడు `డ్రైవర్ రాముడు` అనే మరో యాక్షన్ చిత్రంలో నటించాడు. సప్తగిరి - ధన్ రాజ్ - షకలక శంకర్ వంటి కమెడియన్లు హీరోలుగా ప్రయత్నించి ఫెయిలవ్వడంతో ప్రస్తుతం ఉన్న జబర్ధస్త్ కొలీగ్స్ ఎవరూ హీరోలు అవ్వడం లేదట. మరోవైపు తమిళంలో టాప్ కమెడియన్ గా రాణించిన సంతానం ఇదివరకూ `దిల్లుకు దుడ్డు` అనే యాక్షన్ చిత్రంలో నటించాడు. ఆ సినిమా తమిళంలో యావరేజ్. తెలుగులోనూ అనువాదమై రిలీజైంది. కానీ ఇక్కడ ఫ్లాప్. ప్రస్తుతం `దిల్లుకు దుడ్డు 2` చిత్రంలో నటిస్తున్నాడు. ఇదీ భారీ యాక్షన్ సినిమా అని తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియో సాంగ్ చెబుతోంది. హీరోలంతా కామెడీలు చేసేప్పుడు .. మేం యాక్షన్ చేస్తే తప్పేంటి? అనుకుంటున్నారో ఏమో.. కానీ కొత్తగా ట్రై చేస్తే జనాలు ఎందుకనో కనెక్టవ్వడం లేదు. ఇలా కొత్తగా ట్రై చేసి సెల్ఫ్ గోల్ పెట్టుకోవడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.