Begin typing your search above and press return to search.

మహేష్ అంటే ఆయనకు అంతిష్టమా?

By:  Tupaki Desk   |   16 Sept 2017 3:18 PM IST
మహేష్ అంటే ఆయనకు అంతిష్టమా?
X
భారత దేశం గర్వించదగ్గ ఛాయాగ్రాహకుల్లో సంతోష్ శివన్ ఒకరు. కెమెరాతో ఆయన చేసిన ప్రయోగాలు.. విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ప్రతిభను చాటి చెప్పే విజువల్ వండర్స్ ఎన్నో ఉన్నాయి. ఆయన ఇప్పుడు మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’కు పని చేశారు. తనకు సంతోష్ శివన్ తో పని చేయాలన్నది ఎప్పట్నుంచో ఉన్న కల అని.. ఆ కల మురుగదాస్ ద్వారా తీరిందని మహేష్ చాలా సంబరంగా చెప్పుకున్నాడు ‘స్పైడర్’కు సంబంధించిన వేడుకలో. ఐతే మహేష్.. సంతోష్ మీద అభిమానం చాటుకోవడం ఎవరికీ పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు కానీ.. మహేష్ మీద సంతోష్ చూపించిన అభిమానమే హాట్ టాపిక్ అయింది.

మహేష్ మాట్లాడుతున్నంతసేపూ తన మొబైల్ తీసి.. వీడియో షూట్ చేస్తూ కనిపించాడు సంతోష్. ఆ తర్వాత కూడా మొబైల్ కెమెరాతో ఫొటోలు క్లిక్ చేస్తూనే ఉన్నాడు. మహేష్ తన గురించి మాట్లాడినపుడు ఆయన హావభావాలు భలే ఆకట్టుకున్నాయి అభిమానుల్ని. తన ప్రసంగంలోనూ మహేష్ తననెంతగా ఇంప్రెస్ చేశాడో చెప్పాడు సంతోష్. ఇక ‘స్పైడర్’ చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి సంతోష్ శివన్ ట్విట్టర్ అకౌంట్ పరిశీలిస్తే.. తరచుగా మహేష్ బాబు ఫొటోలు గమనించవచ్చు. డిఫరెంట్ యాంగిల్స్.. డిఫరెంట్స్ కలర్ థీమ్స్ లో మహేష్ ఫొటోలు తీసి.. వాటిని షేర్ చేస్తూ తనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు సంతోష్. అతను ఇంతకుముందు పని చేసిన ఏ హీరోకు సంబంధించిన ఫొటోల్ని కూడా ఇలా షేర్ చేసింది లేదు. ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ మహేష్ మీద ఆయన చూపించిన అభిమానం చర్చనీయాంశమైంది.