Begin typing your search above and press return to search.
పవన్ తో ఎన్టీఆర్ డైరెక్టర్
By: Tupaki Desk | 2 Feb 2016 10:30 PM GMTపవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై కమ్ముకున్న తెరలు నెమ్మదిగా వీడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలతో పవర్ స్టార్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ చేయబోయే రెండు సినిమాల గురించి ఫుల్ క్లారిటీ వచ్చేసిందిప్పుడు. పవన్ ముందుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తన కొత్త సినిమా చేయబోతున్నాడు. ఇది దేనికీ రీమేక్ కాదు. కొత్త సబ్జెక్టు. ‘ఖుషి’ తరహాలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది కానీ.. అది ‘ఖుషి’కి సీక్వెల్ కాదట.
పవన్ ఆ తర్వాత చేయబోయేది తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాలం’కు రీమేక్. ఈ సినిమా దీపావళికి విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఫిక్సయ్యాడు. ‘కందిరీగ’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమై ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా ‘రభస’ తీసిన సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
రీమేక్ బాధ్యతలు అప్పగించడానికి కొన్ని పేర్లను పరిశీలించి చివరికి సంతోష్ ను ఫైనలైజ్ చేశాడట పవన్. ఈ చిత్రం ఈ ఏడాది ఆఖర్లో మొదలయ్యే అవకాశముంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘వేదాలం’లో అజిత్ - శ్రుతి హాసన్ - లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ‘శౌర్యం’ శివ దర్శకత్వం వహించాడు. తమిళంలో ఈ సినిమా రూ.100 కోట్ల దాకా కలెక్షన్లు కొల్లగొట్టింది.