Begin typing your search above and press return to search.
సంతోష్ శోభన్ కాస్త మారాలయ్యా
By: Tupaki Desk | 18 Jan 2023 2:30 AM GMTపేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్రైబ్ వంటి చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో సంతోష్ శోభన్ కు.. తన కెరియర్ లో ఒక్క హిట్టు సినిమా లేదు. కల్యాణం కమనీయం సినిమాతో అయినా ఎమోషన్ వర్కౌట్ అయి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనుకుంటే.. అది కూడా సాధారణ చిత్రంగా బాక్సాఫీసు వద్ద పడిపోయింది. దీంతో అందరూ సంతోష్ శోభన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన తన రూటు మార్చుకుంటే గానీ హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకోలేడని భావిస్తున్నారు.
ఏక్ మినీ కథను నేరుగా ఓటీటీలో విడుదల చేయగా సినిమాకి మంచి రెస్పాన్స్ యే వచ్చింది. కానీ సంతోష్ శోభన్ ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్టును మాత్రం అందుకోలేకపోయాడు. అలాగే మంచి రోజులు వచ్చాయి సినిమా కూడా సంతోష్ శోభన్ కు మంచి రోజులను తీసుకురాలేకపోయాయి. ఆ తర్వాత లైక్ షేర్ సబ్ స్క్రైబే సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. కానీ అది కూడా హ్యాండ్ ఇచ్చింది. దీంతో సంతోష్ శోభన్ రూటు మార్చుకొని మంచి కథలను ఎంచుకుంటాడని అంతా భావించారు.
ఈ క్రమంలోనే కల్యాణం కమనీయం సినిమాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ట్రైలర్ ని చూడగానే.. కి అండ్ కా సినిమాలోని సన్నివేశాలు ఉన్నట్లు కొందరు భావించారు. మరికొందరేమో 7/జీ బృందావన్ కాలనీ తరహాలో ఉంటుందనుకున్నారు.
కానీ సినిమాలో చిన్న చిన్న అంశాలు తప్ప ప్రేక్షకుల చేత వాహ్వా చెప్పించే ఒక్క అంశమూ లేకపోవడం గమనార్హం. అయితే రొటీన్ కథలను ఎంచుకోవడం వల్లే సంతోష్ శోభన్ కు ఒక్క హిట్టు కూడా రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు.
అందుకో సంతోష్ శోభన్ కథలను ఎంచుకోవడంలో తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. టాప్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్లకు రొటీన్ కథలు హెల్ప్ అవుతాయని కానీ... కొత్త హీరోలకు మాత్రం అస్సలే ఉపయోగపడవు.
కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ లేదా అదిరిపోయే స్క్రీన్ ప్లే ఉంటేనే జనాలు చూస్తారు. అలా లేని పక్షంలో సినిమాలు ఆపేయడమే మంచిదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని సంతోష్ శోభన్ అర్థం చేసుకున్నాడో లేదో తెలియాలంటే అతడి మరో సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.