Begin typing your search above and press return to search.

27 ఏళ్ళ తర్వాత అతనితో రజని

By:  Tupaki Desk   |   3 Dec 2018 4:11 PM IST
27 ఏళ్ళ తర్వాత అతనితో రజని
X
సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 బాక్స్ ఆఫీస్ సంచలనం కొనసాగుతోంది. ఇంకో నెలన్నర లోపే మరో కొత్త సినిమా పెట్టా రానుండటంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన పెట్టాలో రజని మాఫియా డాన్ గా నటిస్తున్నట్టు టాక్ ఉంది. దీని తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడు అనే కన్ఫర్మేషన్ అధికారికంగా లేదు కానీ చెన్నయ్ మీడియా మాత్రం మురుగదాస్ తో ప్రాజెక్ట్ లాక్ అయిపోయిందని పెట్టా విడుదల కాగానే షూటింగ్ ప్రారంభిస్తారని గట్టిగా వినిపిస్తోంది.

దీనికి సంబంధించిన టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకునే పనిలో దాస్ బిజీగా ఉన్నట్టు సమాచారం. సర్కార్ ఏ రేంజ్ లో మెప్పించింది అనేది పక్కన పెడితే కమర్షియల్ గా వర్క్ అవుట్ అయిన మాట వాస్తవం. స్పైడర్ గాయాలు తుడిచిపెట్టుకుపోయాయి. విజయ్ తో దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తయిపోయింది. మరో అప్ డేట్ ఏంటంటే రజనితో చేయబోయే సినిమా కోసం సినిమాటో గ్రాఫర్ ని లాక్ చేసుకున్నాడట దాస్. అతను ఎవరో కాదు సంతోష్ శివన్. మహేష్ బాబు స్పైడర్ కి వర్క్ చేసింది ఈయనే.

కాకపోతే ఈ న్యూస్ లో ప్రత్యేకత ఏంటంటే సంతోష్ శివన్ రజనికాంత్ సినిమాకు వర్క్ చేసి పాతికేళ్ళు దాటేసింది. చివరిగా మణిరత్నం దళపతికి సంతోష్ శివన్ పని చేసాడు. అందులో మమ్ముట్టితో పాటు రజని హీరో. దాని తర్వాత ఇద్దరి కాంబో కుదరలేదు. ఇన్నాళ్లకు మురుగదాస్ ద్వారా అది నిజం కాబోతోంది. హీరోయిన్ గా కీర్తి సురేష్ లేదా కాజల్ అగర్వాల్ వైపు మురుగదాస్ మొగ్గు చూపుతున్నట్టు కూడా మరో టాక్ ఉంది. సో ఇంకో నెల రోజుల్లోనే తలైవా కొత్త సినిమాకు సంబంధించిన న్యూస్ వచ్చేస్తాయి