Begin typing your search above and press return to search.
మాస్ వదిలేసి మేసెజ్ అంటున్నాడే..
By: Tupaki Desk | 14 Oct 2016 1:30 PM GMTటాలీవుడ్ లో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. మాస్ పల్స్ పట్టుకోవడంలో కొందరు ఎక్స్ పర్ట్స్ అయితే.. లవ్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయడంలో ఇంకొందరు సూపర్. ఫీల్ గుడ్ మూవీస్.. ఫ్యామిలీ ఒరియెంటెడ్ ఇలా సినిమాలు తీసే విధానంలో ఎవరి బ్రాండ్ వారికుంది. అయితే ఒకే దారిలో వెళ్లి వెళ్లి బోర్ కొట్టేస్తుందేమో ఈ మధ్య డైరెక్టర్స్ డిఫరెంట్ గా ట్రై చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఎంటర్ అవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్.
ఫస్ట్ మూవీతోనే అదరగొట్టేశాడు సంతోష్. కందిరీగ తీసి రామ్ కెరీర్ లో మర్చిపోలేని మాస్ విజయాన్ని అందించాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో రభస చేశాడు. సినిమా ఫలితం దారుణంగా ఉన్నా మాస్ సబ్జెక్ట్ ల్ని బాగానే డీల్ చేయగలడనే పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా హైపర్ అంటూ కలిసొచ్చిన హీరోతో మరో ప్రయత్నం చేశాడు. కందిరీగ.. రభస ఎంటర్ టైన్ మెంట్ విత్ యాక్షన్ స్టోరీస్ కాగా.. హైపర్ లో మాత్రం మేసెజ్ ని మిక్స్ చేశాడు. ఇదో సందేశాత్మక సినిమా అని జనాలు కూడా గుర్తించారులెండి.
అందుకే ఈ ఫ్లోలో ఇక మీదట కూడా మేసెజ్ ఒరియెంటెడ్ మూవీస్ తీస్తానని ప్రకటించాడు ఈ హైపర్ డైరెక్టర్. మేసెజ్ లు మంచివే కానీ.. ఇచ్చే సందేశాలు ఎంతమందికి నచ్చుతాయనేదే అసలు ప్రశ్న. హైపర్ లో ఇచ్చిన మేసెజ్ అందరికీ ఎక్కలేదనే విషయం ఆ మూవీ బాక్సాఫీస్ కలక్షన్ చెప్పకనే చెప్పింది. అయినా గానీ అదే పని చేస్తా అంటున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. మారి మాస్ వదిలేసి మెసేజ్ వర్కవుట్ అవుద్దా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/