Begin typing your search above and press return to search.
మెగా మేనల్లుళ్ల వెంట కందిరీగ!
By: Tupaki Desk | 30 Jun 2022 5:30 AM GMTసినిమాటోగ్రాఫర్ గా పరిచయమై దర్శకుడిగా టర్న్ తీసుకున్న సంతోష్ శ్రీనివాస్ స్టార్స్ తో ఎంత వేగంగా సినిమాలు చేసారో? అంతే వెగంగా వెనక్కి వెళ్లిపోయారు. తొలి సినిమా 'కందిరీగ'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వరుస ప్లాప్ ల్లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్కి సక్సెస్ ఇవ్వడంతో సంతోష్ పేరు టాలీవుడ్ అంతటా మారుమ్రోగిపోయింది.
కానీ రెండవ ఛాన్స్ రావడానికి మాత్రం మూడేళ్లు సమయం పట్టింది. కానీ అప్పుడు ఏకంగా యంగ్ టైటర్ ఎన్టీఆర్ నే లాక్ చేసి షాక్ ఇచ్చారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'రభస' తెరకెక్కించి దారుణమైన ఫలితాన్ని అందించారు. దీంతో సంతోష్ పనైపోయిందని విమర్శలు తెరపైకి వచ్చాయి. కానీ రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రామ్ తో 'హైపర్' తెరకెక్కించారు.
అదీ తేడా కొట్టింది. అటుపై ఐదేళ్ల గ్యాప్ తీసుకుని యంగ్ స్టార్ సాయి శ్రీనివాస్ తో 'అల్లుడు అదుర్స్' అంటూ వచ్చారు. ఆ సినిమా ఫలితం గురించి కూడా తెలిసిందే. అప్పటి నుంచి సంతోష్ శ్రీనివాస్ కదలికలు టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు. దర్శ కుడిగా సినిమా చేయలేదు. సినిమాటోగ్రాఫర్ గా యూ టర్న్ కూడా తీసుకోలేదు. అయితే సంతోష్ ఈసారి ఏకంగా మెగా మేనల్లుళ్లని టార్గెట్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.
సాయితేజ్...వైష్ణవ్ తేజ్ లలో ఎవరో ఒకర్ని లాక్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మెగా కాంపౌండ్ లో తనకున్న పరిచయాలు ఉపయోగించుకుని ఇప్పటికే కాంపౌండ్ లో కాలు పెట్టినట్లు సమాచారం. స్టార్లని డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. నెమ్మదిగా మెగా అల్లుళ్ల ఇద్దరిలో ఎవరో ఒకర్ని కథతో మెప్పించగల్గితే గట్టెక్కొచ్చని భావిస్తున్నట్లు కనిపిస్తుంది.
అయితే అదంత ఈజీ కాదు. ఇప్పటికే సాయితేజ్ కెరీర్ ఏమంత యాక్టివ్ గా లేదు. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. గత అనుభవాలే గుణపాఠాలుగా ముందుకు సాగుతున్నారు. కొత్త జానర్ సినిమాలు చేయాలని తపిస్తున్నాడు. మార్కెట్ లో నిలబడాలంటే పాత పద్దతి వదిలితే తప్ప పనవ్వదని గ్రహించిన సాయి ఇప్పుడు న్యూ థాట్స్ ని ఎంకరేజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇక వైష్ణవ్ కమర్శియల్ జోనర్ తో పాటు..ఇన్నో వేటివ్ థాట్స్ ని ప్రోత్సహిస్తున్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. సంతోష్ ప్లాన్ వర్కౌట్ అయితే ఇక్కడే అవ్వాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.