Begin typing your search above and press return to search.
తన అందం బరువుపై నెటిజనుల కామెంట్లపై నటి ఫైర్
By: Tupaki Desk | 11 Jun 2021 5:30 PM GMTఇటీవల బాడీ షేమింగ్ కి నెటిజనుల ట్రోలింగ్ కి గురి కాని కథానాయిక లేరు. సమీరా రెడ్డి.. సుహానా ఖాన్..అనన్య పాండే.. ఇరా ఖాన్ .. ఇలా ఎందరో సెలబ్రిటీలు ఇటీవల బహిరంగంగా తమకు ఎదురైన బాడీ షేమింగ్ గురించి వాపోయారు.
తాజాగా తన అందం గురించి నెటిజనులు తీవ్రంగా ట్రోల్ చేసారంటూ మలయాళ నటి సానూషా ఆవేదన వ్యక్తం చేశారు. బాడీ పాజిటివిటీ గురించి బలమైన సందేశంతో తన ఫోటోను పంచుకోవడానికి నటి సానుషా ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులకు టచ్ లోకి వెళ్లారు. తన అందంపై ట్రోల్స్ చేసిన వారిపై ఆమె విరుచుకుపడింది.
బాడీ షేమ్ చేసిన ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు సానూష ఇన్ స్టాలో ఓ ఫోటోని షేర్ చేశారు. ఆమె కెమెరా వద్ద నవ్వుతూ ఉన్న ఫోటో ఇది. ఈ ఫోటో చూశాక సానూష బరువు పెరిగిపోయిందని దాని గురించి బాధపడుతున్నారని చాలా మంది ఎత్తిచూపారు. అయితే తన గురించి ఎందుకు? తమను తాము మానసికంగా శారీరకంగా మెరుగయ్యేలా చూసుకోవాలని సానూష కోరారు.
బాలనటిగా కెరీర్ ని ప్రారంభించిన సానుషా మలయాళ- తమిళ- తెలుగు చిత్రాల్లో నటించింది. ఓంకార్ జీనియస్ లో నాయికగా నటించిన ఈ బ్యూటీ నాని జెర్సీలోనూ కనిపించింది. ఇటీవల తను అనూహ్యంగా బరువు పెరగడం గురించి అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్న సందేశాలను పంచుకున్నారు. దానికి కౌంటర్ గా ``ఓహ్ అవును !! నా బరువు గురించి ప్రస్తావిస్తూ.. దాని గురించి చింతిస్తూ ఎక్కువగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ.. బహుశా నాకన్నా ఎక్కువగా స్వీట్ హార్ట్ ఉంది.. ముందు మీరు బరువు తగ్గండి.. అందంగా ఉండండి`` అని వ్యంగ్యంగా స్పందించారు. ఒకరిపై రెండు వేళ్లు చూపించినప్పుడు మన వైపు మూడు వేళ్లు చూపిస్తుంటాయన్నది గుర్తుంచుకోండి. మీ శరీరాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అన్నారు.
మల్లయాళ చిత్రం కల్లు కొండు పెన్నూలో సానూష చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాక అనేక భాషలలో సినిమాల్లో నటించడం కొనసాగించింది. ఇది 2012 లో `మిస్టర్ మారుమకన్` చిత్రంలో కథానాయికగా అరంగేట్రం చేసింది. జీనియస్.. అలెక్స్ పాండియన్.. మిలి.. వెట్టా వంటి చిత్రాలలో నటించింది.