Begin typing your search above and press return to search.

ఆటోలో వెక్కి వెక్కి ఏడ్చిన రోజులు గుర్తున్నాయ్!

By:  Tupaki Desk   |   22 Dec 2022 3:43 AM GMT
ఆటోలో వెక్కి వెక్కి ఏడ్చిన రోజులు గుర్తున్నాయ్!
X
న‌టిగా స్టార్ డ‌మ్ ని అందుకోవాలంటే దానికి ముందు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరంభం ఆడిష‌న్స్ కి వెళ్లేందుకు ఆటోకి డ‌బ్బుల్లేని ధీన స్థితిలో కూడా కొంద‌రు న‌టీమ‌ణులు ఉంటారు. ఆడిష‌న్ అయ్యాక అదే ఆటోలో వెళుతూ కంట త‌డి పెట్టుకున్న భామ‌లు ఉన్నారు. ఇదే కేట‌గిరీకి చెందుతుంది సాన్య మ‌ల్హోత్రా. బాలీవుడ్ లో న‌ట‌వార‌సురాళ్ల హ‌వా కొన‌సాగుతున్న పోటీ ప్ర‌పంచంలో కూడా సాన్యా లాంటి ట్యాలెంట్ త‌న‌ని తాను నిరూపించుకునేందుకు ఎంత‌దాకా అయినా వెళ‌తార‌ని నిరూప‌ణ అయ్యింది. సాన్య తన కెరీర్ స్ట్ర‌గుల్స్ గురించి వ‌ర్ణించిన తీరు కంట‌త‌డి పెట్టిస్తుంది.

అదంతా అటుంచితే ఇప్పుడు సాన్యా మ‌ల్హోత్రా పేరు బాలీవుడ్ లో మార్మోగుతోంది. అమీర్ ఖాన్ తెర‌కెక్కించిన 'దంగల్ - సీక్రెట్ సూప‌ర్ స్టార్' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ఆరంభ‌మై బాలీవుడ్ లో సాన్యా ఎదురేలేని కెరీర్ ని సాగిస్తోంది. హిట్- ది ఫస్ట్ కేస్ చిత్రంలోను సాన్యా న‌టించింది. ఇక ఈ భామ ఓటీటీలోను త‌న‌దైన ప్ర‌ద‌ర్శ‌న‌తో మైమ‌రిపిస్తోంది.

తాజాగా సాన్య మల్హోత్రా ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్ 2022 వేడుక‌ల్లో త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించిన తీరు కుర్ర‌కారులో చ‌ర్చ‌కు వచ్చింది. కొంకణా సేన్ శర్మ స‌హా ప‌లువురు క‌థానాయిక‌ల‌తో పాటు రెడ్ కార్పెట్ పై సాన్యా సంద‌డి చేసింది. ఈ బ్యూటీ మెరూన్ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్ లో అందంగా క‌నిపించింది. అయితే ఈ డ్రెస్ లో కాస్త హ‌ద్దుమీరి ఎక్స్ పోజ్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

OTT స్పేస్ లోని అత్యుత్తమ ప్రతిభను గుర్తించేందుకు ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులను అందిస్తోంది. ఓటీటీలో ప‌ని చేసే ప్ర‌తిభావంత‌మైన‌ నటీనటులు- దర్శకులు- నిర్మాతలు- రచయితలు- సంగీతకారులు- సాంకేతిక నిపుణులు స‌హా 24 శాఖ‌ల ట్యాలెంట్ కు వీటిని అందిస్తున్నారు. తాజాగా ఓటీటీ ఫిలింఫేర్ అవార్డుల వేడుక‌లో ముంబై పరిశ్రమకు చెందిన కొంద‌రు జెంటిల్మ‌న్ సమావేశమయ్యారు. ఈ వేడుక‌లో రెడ్ కార్పెట్ పై హొయ‌లు పోయిన సన్యా మల్హోత్రా అందమైన మెరూన్ గౌనులో ఎప్పటిలాగే అందాలు ఒల‌క‌బోసింది. రెడ్ కార్పెట్ పై కొంకణా సేన్ శర్మ క్లాసిక్ చీరలో చాలా అందంగా కనిపించారు.

ఇక సాన్యా త‌న కెరీర్ ఆరంభ రోజుల గురించి గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో న‌టిస్తూనే ఓటీటీలోను న‌టించాను. ఓటీటీ కారణంగా నా కెరీర్ లో పెద్ద మార్పు కనిపించింది. ప్రేక్షకులకు ఏకకాలంలో వివిధ‌ ప్లాట్ ఫారమ్ లు అందుబాటులో ఉన్నప్పుడు అభివృద్ధికి అవ‌కాశం ఎక్కువగా ఉంటుంది అని తెలిపింది. ప్రధాన స్రవంతి సినిమాకి అసాధారణమైనదిగా భావించే పాత్రలపై పని చేయడం.. గుర్తింపు కీలకం అని సన్యా నొక్కి చెప్పింది. కొత్త పాత్రలతోనే తాదాత్మ్యం చెందే పాఠం నేర్చుకుంటామ‌ని..ప్ర‌తిసారీ తెలివితేట‌లు చూపించ‌లేమ‌ని కూడా అన్నారు.

సాన్యా ఫ్లాష్ బ్యాక్ కి వెళితే.. న్యూఢిల్లీ కి చెందిన ఈ బ్యూటీ ముంబైకి వచ్చినప్పుడు ఆడిష‌న్స్ కోసం ఆటోల్లో ప్ర‌యాణించేదానిని అని తెలిపారు. అయితే సన్యా మల్హోత్రా న‌టించిన‌ తొలి చిత్రం దంగల్ అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి వ‌ర‌ల్డ్ వైడ్ అత్యుత్త‌మ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల‌కెక్కింది. పరిశ్రమలో కేవ‌లం ఐదారేళ్ల‌లోనే సన్యా మల్హోత్రా తన స‌త్తా ఏంటో చూపించింది. ఇప్ప‌టికి డ‌జ‌ను పైగా చిత్రాల్లో న‌టించేసింది. త‌న పేరుకు త‌గ్గ‌ట్టే విల‌క్ష‌ణ‌మైన‌ పాత్రల్లో న‌టించి న‌టిగా మెప్పించింది.

చిన్నప్పుడు నాన్నగారు సినిమాలు చూడటానికి అనుమతించేవారు కాదని సినిమాల్లోకి నో ఎంట్రీ అని కూడా సాన్యా ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. కానీ సినిమాకి వెళ్లిన‌ ప్రతిసారీ నేను తెరపై వెలుగుతున్న‌ న‌టీన‌టుల నుండి చాలా ప్రేరణ పొందాను! నేను బొంబాయికి మారినప్పుడు ఢిల్లీ నుంచి వ‌చ్చిన ఇత‌రుల‌తో కలిసి ఒక‌ అపార్ట్ మెంట్ లో రెండేళ్ల పాటు నివ‌శించాను! నా క‌ల‌ల‌కు అనుగుణంగా నిజంగా నటిగా నన్ను నేను నిర్మించుకున్నాను... అని త‌న క‌థ‌ను వెల్ల‌డించారు.

నా కెరీర్ ఆరంభ ద‌శ‌లో నేను కలిసిన వ్యక్తులు స్నేహితుల నుండి గొప్ప విశ్వాసం ప్రేరణ ద‌క్కింది. ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ను ప్రారంభించేందుకు దంగల్ వంటి అవకాశాన్ని పొందలేరు. ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమాలో నా పాత్ర ఎలాంటి ప్రశంసలను అందుకుంటుందో గుర్తుంది! అంటూ గ‌తంలోకి వెళ్లి త‌న మ‌న‌సును ఆవిష్క‌రించింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.