Begin typing your search above and press return to search.
దీపావళి సందర్బంగా గృహ ప్రవేశం చేసిన హీరోయిన్
By: Tupaki Desk | 6 Nov 2021 12:30 AM GMTఒకప్పుడు హీరోయిన్స్ అంటే సొంత ఇల్లుకు చాలా సమయం పట్టేది. స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుని మూడు నాలుగు పెద్ద సక్సెస్ లు వస్తే కాని సొంత ఇల్లు ఇతర ఆస్తులు కొనుగోలు చేసేంతటి పారితోషికాలు వచ్చేవి కావు. కాని ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వెంటనే ఆదాయం షురూ అవుతూనే ఉంది. ఒకటి రెండు సినిమాల్లో నటించి కాస్త గుర్తింపు దక్కించుకుంటే చాలు సెలబ్రెటీల ఆదాయం భారీగా వస్తూనే ఉంటుంది. కేవలం సినిమాల పారితోషికాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా... బ్రాండ్స్ ప్రమోషన్ ద్వారా ఇంకా మోడలింగ్ ద్వారా రకరకాల మార్గాల్లో ఆదాయాలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు బుల్లి తెర మరియు వెండి తెరపై కాస్త గుర్తింపు వస్తే చాలు కార్లు ఆస్తులు కొనుగోలు చేసేస్తున్నారు.
తాజాగా దంగల్ బ్యూటీ సన్య మల్హోత్ర ఇల్లు కొనుగోలు చేసింది. ఈమద్య కాలంలో ఈమె ముంబయిలోని అత్యంత ఖరీదైన ఏరియా అయిన జుహు ప్రాంతంలో ఒక అపార్ట్ మెంట్ లో ప్లాట్ ను కొనుగోలు చేసింది. గత ఏడాది అదే అపార్ట్ మెంట్ లో బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ దాదాపుగా 100 కోట్లకు పైగా ఖర్చు చేసి అత్యాధునిక హంగులు ఉన్న ప్లాట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు అదే అపార్ట్ మెంట్ లో సన్య ప్లాట్ కొనుగోలు చేసి హృతిక్ రోషన్ కు నైబర్ గా మారిపోయింది. అలాంటి ఖరీదైన ఏరియాలో ఇల్లు కొనుగోలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సన్య మంచి ఫామ్ లో ఉన్న కారణంగా ఈ ఖరీదైన ఇల్లును కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.
సన్య మల్హోత్ర దాదాపుగా 15 కోట్లు పెట్టి ఆ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు మరి కొంత పెట్టి తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్ ను డిజైన్ చేయించుకుందట. అత్యంత సుందరంగా తయారు చేయించుకున్న తన సొంత ఇంటికి దీపావళి సందర్బంగా వెళ్లినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. కొత్త ఇంట్లో దీపావళి వేడుకలు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. దంగల్ సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్న సన్య ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కూడా ఈమె నటించిన మీనాక్షి సుందరేశ్వర్ విడుదలకు సిద్దంగా ఉంది. అది కాకుండా మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయని ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయని సమాచారం అందుతోంది.