Begin typing your search above and press return to search.

సుశాంత్ సింగ్ గుట్టు వ్య‌క్తిగ‌త‌ స్టైలిష్ట్ లీకులు

By:  Tupaki Desk   |   15 Jun 2020 9:50 AM GMT
సుశాంత్ సింగ్ గుట్టు వ్య‌క్తిగ‌త‌ స్టైలిష్ట్ లీకులు
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం అందరినీ షాక్ ‌కు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ తీవ్ర షాక్ ‌లో ఉంది. అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌ నుండి సంతాపం వ్య‌క్త‌మైంది. సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా లేక హ‌త్య‌నా? అన్న‌దానిపై పూర్తి క్లారిటీ రాలేదింకా. అయితే సెలబ్రిటీ హెయిర్ ‌స్టైలిస్ట్ సప్నా భావ్నాని తాజా ట్వీట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. సుశాంత్ తో త‌న ఛాయా చిత్రాలను పంచుకున్న సప్నా ఊహించ‌ని కామెంట్ చేశారు. సుశాంత్ కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నాడ‌ని సాప్నా ట్వీట్ చేయ‌డం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది.

``సుశాంత్ చాలా కష్టపడుతున్నాడని.. అతడికి పరిశ్రమ నుండి సహాయం లేద``ని సాప్నా తాజా ట్వీట్ లో వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సుశాంత్ చాలా కఠినమైన స్థితిలోనే ఉన్నాడన్నది రహస్యం కాదు. పరిశ్రమలో ఎవరూ అతని కోసం నిలబడలేదు. ఎవ‌రూ సహాయం చేయలేదు`` అంటూ ఆమె చేసిన‌ ట్వీట్ స‌రికొత్త ఆలోచ‌న‌ను రేకెత్తిస్తోంది.

అయితే సాప్నా ఉద్ధేశం ఏదైనా సుశాంత్ సింగ్ కెరీర్ ప‌రంగా ఏమంత నిరాశ‌జ‌న‌కంగా లేడు. వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లోనే న‌టిస్తున్నాడు. కెరీర్ ప‌రంగా పూర్తి సంతృప్తిగానే ఉన్నా.. అత‌డికి అంత‌కుమించి ఇంకేదో స‌మ‌స్య ఉంద‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమ నిజంగా ఎంత నిస్సారంగా ఉంటుందో.. దాని వెన‌క ఎలాంటి క‌ఠోర స‌త్యాలు ఉంటాయో అర్థం చేసుకోవాల్సిన త‌రుణ‌మిదే. ``సుశాంత్ ఇక్క‌డ‌ ఎవరూ మీ స్నేహితుడు కాదు`` అంటూ సాప్నా వ్యాఖ్యానించ‌డాన్ని బ‌ట్టి ఇండ‌స్ట్రీలో బెస్ట్ స్నేహితుడు ఎవ‌రూ లేర‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ‌రూ త‌న‌ని చివ‌రి నిమిషంలో స‌ముదాయించ‌లేద‌ని వెల్ల‌డ‌వుతోంది.

కెరీర్ ఆరంభం `సోంచిరియా` పరాజయం తరువాత ఓ అభిమాని ట్వీట్ ‌కు సమాధానమిస్తూ సుశాంత్ ఏమ‌న్నారంటే.. ``పరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్ ఎవ‌రూ లేర‌ని.. మనుగడ కఠినంగా ఉంద``ని అన్నారు. అంటే కెరీర్ ప‌రంగా సుశాంత్ సెల్ఫ్ మేడ్ మాత్ర‌మేన‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మ‌ర‌ణానంత‌రం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇత‌ర హీరోల‌ కంటే అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉన్నాడు అని మాధుర్ భండార్కర్ వ్యాఖ్యానించ‌డం అత‌డి ఎదుగుద‌ల‌కు సూచిక అని భావించాలి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఏడాది నవంబర్‌లో సుశాంత్ వివాహం చేసుకోవాల్సి ఉండ‌గా.. ఆక‌స్మిక మ‌ర‌ణం కుటుంబీకుల‌కు బిగ్ షాక్. అతని మ‌ర‌ణ‌వార్త వినగానే కుటుంబం పాట్నా నుండి బ‌య‌లు దేరారు. అతని అంత్యక్రియలు ఈ రోజు ముంబైలో జరుగుతాయి.

కెరీర్ సంగ‌తి చూస్తే.. చివరిసారిగా నితేష్ తివారీ చిచోర్ లో న‌టించాడు. సంకేనా సంఘీతో కలిసి నటించిన ముఖేష్ ఛబ్రా `దిల్ బెచారా` సెట్స్ పై ఉంది. సుశాంత్ సెట్స్ కెళ్లాల్సి ఉండ‌గా తాజా ఇన్సిడెంట్ షాక్ కి గురి చేసింది.