Begin typing your search above and press return to search.
వరుణ్ ని ఇంటికి పిలిచిన భామ
By: Tupaki Desk | 31 Jan 2018 4:53 AM GMTహిందీ సీరియల్స్ తో పాటు.. బాలీవుడ్ మూవీ ఖామోషియాలో కనిపించిన బ్రిటన్ భామ సప్నా పబ్బి.. ఇప్పుడు వరుణ్ తేజ్ మూవీ తొలిప్రేమతో.. టాలీవుడ్ లోకి తెలుగు అడుగులు వేస్తోంది. పలు కార్పొరేట్ కంపెనీల యాడ్స్ లో ఇప్పటికే దక్షిణాది జనాలకు కనిపించిన ఈ బ్యూటీ.. తొలిసారిగా ఓ సినిమా ద్వారా తెలుగులోకి వస్తోంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న తొలిప్రేమ చిత్రంలో.. ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది సప్నా పబ్బి. స్పెషల్ అంటే.. అదేమీ ఐటెం సాంగ్ కాదు. సిట్యుయేషన్ ప్రకారం కుదిరిన ఓ సూపర్బ్ సాంగ్. సునోనా సునయనా అంటూ సాగే ఈ పాటకు.. ఇప్పటికే బోలెడంత క్రేజ్ వచ్చింది. ఓ టూరిస్ట్ గైడ్ గా తొలిప్రేమలో కనిపించనున్న ఈ బ్యూటీపై.. ఈ చక్కని పాటను చిత్రీకరించారట. లండన్ వీధుల్లో షూటింగ్ జరుపుకోగా.. ఈ పాట పిక్చరైజేషన్ కు నాలుగు రోజులు పట్టిందని అంటోంది సప్నా పబ్బి. లండన్ తమ ఊరే కావడంతో.. వరుణ్ తేజ్.. వెంకీ అట్లూరి ఇద్దరినీ ఆ నాలుగు రోజుల పాటు తమ ఇంటికి రావాలంటూ ఆహ్వానిస్తూనే ఉందట.
అయితే షూటింగ్ బిజీ కారణంగా అసలు కుదరనే లేదని అంటోంది సప్నా పబ్బి. ఓ డిఫరెంట్ ప్రయత్నం చేద్దామనే ఉద్దేశ్యంతో తొలిప్రేమలో స్పెషల్ సాంగ్ కు యాక్సెప్ట్ చేశానని చెప్పిన ఈ బ్రిటిష్ బ్యూటీ.. తనకు పంజాబి హిందీ భాషలు అయితే కంఫర్ట్ గా ఉంటాయని.. తెలుగులో ఇప్పటి వరకూ 'నాకు అర్ధం కాలేదు' అన్న సెంటెన్స్ ఒక్కటే నేర్చుకున్నానని చెబుతోంది.