Begin typing your search above and press return to search.
ఆక్సిజన్ కూడా అందని చోట గోవింద షూట్
By: Tupaki Desk | 28 April 2019 1:30 AM GMTప్రేమ కథా చిత్రమ్ తో ఒక్కసారిగా స్టార్ కమెడియన్ గా మారిపోయిన సప్తగిరి ఆ తర్వాత కమెడియన్ గా కొనసాగి హీరోగా మారిపోయాడు. హీరోగా ట్రై చేసిన మొదటి సినిమా 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో కామెడీతో పాటు సెంటిమెంట్ పండించి వావ్ అనిపించాడు. ఆ తర్వాత సప్తగిరి ఎల్ ఎల్ బి తో వచ్చాడు. అయితే ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని సప్తగిరి చేసిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం 'వజ్ర కవచధర గోవింద'. ఈ చిత్రం చాలా రోజులుగా వార్తల్లో నానుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు.
మే 17వ తారీకున ఈ చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించారు. అదే ప్రెస్ మీట్ లో సినిమా మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ ఈ చిత్రంకు దర్శకత్వం వహించిన కారణంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే టీజర్ తో మెప్పించారు. తాజా ప్రెస్ మీట్ లో హీరో సప్తగిరి మాట్లాడుతూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాడు.
సప్తగిరి మాట్లాడుతూ... ఈ చిత్రం కథ మొత్తం కూడా ఒక వజ్రం చుట్టు తిరుగుతుంది. మంచి లక్ష్యంతో పని చేస్తున్నప్పుడు వెళ్లే మార్గం కూడా మంచి మార్గం అయ్యి ఉండాలి, చెడు మార్గంలో మంచి లక్ష్యం కోసం వెళ్తే చెడే జరుగుతుంది అనేది మా చిత్రంలో చూపించబోతున్నాం. ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. చిన్న చిత్రం అవ్వడం వల్ల ఎక్కువ బడ్జెట్ తో సెట్టింగ్ లు వేయడం కష్టం అయ్యింది. అందుకే ఎక్కువ రియల్ లొకేషన్ లోనే చేశాం. ఒక సీన్ కోసం కర్నూలులోని ఒక గుహలో షూట్ చేయాల్సి వచ్చింది. అక్కడ సరిగా ఆక్సీజన్ కూడా సరిగా అందలేదు. చాలా కష్టపడి షూట్ చేశాం. నాతో పాటు హీరోయిన్ కూడా చాలా కష్టపడింది. నా ప్రతి సినిమా టైటిల్ గోవిందుడి చుట్టు తిరగడం కాకతాళీయంగా జరుగుతుంది. దేవుడి అనుగ్రహం ప్రకారం అలా జరుగుతుందని భావిస్తున్నాను. క్యాన్సర్ వ్యాదిగ్రస్తుల నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుంది. మండలంకు ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంటే చాలా బాగుంటుంది. అప్పుడే క్యాన్సర్ వ్యాదిగ్రస్తులను బతికించుకోగలం. ఈ చిత్రంతో మరోసారి మిమ్ములను ఆకట్టుకుంటాను అనే నమ్మకం ఉందని సప్తగిరి చెప్పుకొచ్చాడు.