Begin typing your search above and press return to search.
సప్తగిరిగా అలా డిసైడయ్యాడు
By: Tupaki Desk | 13 Dec 2017 4:14 AM GMTవెండితెరపై మెరిసే తారల్లో అసలు పేరు పక్కన పెట్టి స్క్రీన్ పై కనిపించే పేరుతో పాపులరైన వారెందరో ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి మొదలుకొని నేటి కామెడీ స్టార్ సప్తగిరి వరకు చాలామందే ఈ జాబితాలో కనిపిస్తారు. కామెడీ వేషాలతో సినిమాల్లో చక్కటి పేరు తెచ్చుకుని హీరోగా టర్న్ అయిన సప్తగిరి ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేశాడు.
సప్తగిరి అసలు పేరు తెలిసింది చాలా తక్కువమందికే. అతడి పేరు అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. సప్తగిరి అని స్క్రీన్ నేమ్ పెట్టుకోవడమే తనకు బాగా కలిసొచ్చిందని నమ్మకంగా చెబుతున్నాడు. అసలు ఈ పేరు ఎందుకు పెట్టుకున్నారంటే దాని వెనుక ఓ ఇంట్రస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని చెప్పుకొచ్చాడు. ఓ రకంగా అది దైవలీల కూడా అని అంటున్నాడు. ‘‘సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన ఉన్న రోజుల్లో తిరుమలకు దర్శనానికి వెళ్లా. మాడ వీధుల్లో సరదాగా తిరుగుతుండగా ఒకచోట నిలుచుని ఉంటే ఓ వ్యక్తి నాన్నా సప్తగిరీ.. పక్కకు జరుగు అన్నాడు. అలా పిలిచిందెవరా అని చూస్తే ఓ కాషాయ దుస్తుల్లో కనిపించాడు. ఆయనలాగే చాలామంది అక్కడున్నారు. వారంతా నన్ను దాటుకుని నడుచుకుంటూ వెళ్లారు. ఆ క్షణం నాకు ఓ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. అందుకు కారణమైన సప్తగిరి అన్న పిలుపునే నా పేరుగా పెట్టుకోవాలని ఆ క్షణమై డిసైడై పోయాను’’ అని పేరు వెనుక కథ గురించి సప్తగిరి చెప్పిన వివేషాలివి.
ముందు సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా తొలి అడుగు వేసిన సప్తగిరి తాజాగా సప్తగిరి ఎల్.ఎల్.బి. సినిమా చేశాడు. బాలీవుడ్ సినిమా జాలీ ఎల్.ఎల్.బి. కి రీమేక్ గా ఈ మూవీ తీశారు. చరణ్ లక్కాకుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కశిష్ ఓహ్రా హీరోయిన్ గా నటించింది.