Begin typing your search above and press return to search.
కమెడియన్ దర్శకత్వం తప్పేంటి?
By: Tupaki Desk | 19 Sep 2018 4:20 AM GMTహీరోగా నటిస్తే కమెడియన్ గా ఛాన్సులివ్వరా? అందివచ్చిన ఛాన్స్ ఒడిసిపట్టుకుంటే అది తప్పా? ఈగోయిస్టిక్ శాడిస్టిక్ స్టుపిడిష్ వరల్డ్!! ఈ రంగుల ప్రపంచం ఎంతో వింతైనది. అప్పటికప్పుడే ఆకాశానికెత్తేస్తుంది. అంతలోనే పాతాళానికి తొక్కేస్తుంది. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే బాగా బలిసిన గాడ్ ఫాదర్ వెనకైనా లేదా ముందైనా ఉండాలి. ఛస్! అలాంటోడు లేడు కాబట్టే స్టార్ కమెడియన్ సప్తగిరి ఊహించని రీతిలో ఝలక్ తిన్నాడు. పొట్ట చేతబట్టుకుని పరిశ్రమకొచ్చాడు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఎదిగాడు. అవకాశాల కోసం కాళ్లకున్న ప్యారగాన్ చెప్పులు అరిగేలా తిరిగాడు. ఆ కష్టం ఫలించి ఒకరోజు `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` లాంటి అవకాశం వచ్చింది. ఛీఛీ వీడు కమెడియన్ ఏంటి? అంటూ ఛీదరించుకున్న చోటా కె.నాయుడు లాంటి స్టార్ సినిమాటోగ్రాఫర్... కమెడియన్ అంటే వీడే అని వేదికలపై పొగిడేశారంటే అందుకు ఎంత మెప్పించాల్సి వచ్చిందో తెలుసా?
అందుకే కమెడియన్ వేషాలు వేస్తూనే - హీరోగా అవకాశం వస్తే అందిపుచ్చుకున్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ - సప్తగిరి ఎల్ ఎల్ బి చిత్రాలతో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. డామ్ షిట్ ఈగోయిస్టిక్ ఇండస్ట్రీ! కమెడియన్ హీరో అవుతాడా? అంటూ అతడిని చాలానే ఆడిపోసుకుంది. అందుకే హీరో అయిన వాడికి క్యారెక్టర్లెందుకు అనుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలిచ్చేందుకు వెనకాడుతున్నారు మన దర్శకనిర్మాతలు. వీళ్లంతా ఈగోయిస్టిక్ ఫెలోస్ అంటే తప్పేం కాదు! అందుకే ఇలాంటి చోట ఎలా ముందుకెళ్లాలో తెలిసినవాడిగా ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు.
పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి. సత్తా చాటాలి. కెరీర్ స్ట్రగుల్ ప్రతి ఒక్కిరికీ ఉంటుంది. ప్రతిదీ పాజిటివ్ గా తీసుకుంటేనే! అంత వెలిగినా ఎందుకు ఛాన్సులివ్వలేదో తేల్చుకోవాల్సిన టైమొచ్చింది. అయినా తాను వచ్చింది దర్వకుడవుదామనే. అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాప్ కొట్టాకే ఊహించని ఛాన్స్ తో ముఖానికి రంగేసుకుని ఆర్టిస్టు అయ్యాడు. ఇండస్ట్రీ ఇప్పటివరకూ ఇచ్చింది చాలు. ఇకపై ఏదైనా ఇస్తే అదో బోనస్ కిందే లెక్క. అందుకే ఇప్పుడు దర్శకుడిగా సత్తా చాటుతానని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. నిర్మాతలకు కథ చెప్పాడు. అట్నుంచి ఫైనల్ కాల్ రావాల్సి ఉంది. జస్ట్ వెయిట్.