Begin typing your search above and press return to search.

అంతకు మించి.. కావాలంటున్న తాప్సీ

By:  Tupaki Desk   |   7 May 2016 7:50 AM GMT
అంతకు మించి.. కావాలంటున్న తాప్సీ
X
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఇప్పుడు హిట్స్ లో ఉన్నా సరే బాగా స్లోగా ఉంది. గంగ లాంటి బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత కూడా.. అమ్మడి కెరీర్ లో స్పీడ్ లేదు. సినిమా ఛాన్సులైతే ఉన్నాయి కానీ.. ఎడా పెడా ఒప్పుసుకోవడం లేదు తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు ఓ మ్యూజిక్ వీడియో కూడా చేస్తోంది తాప్సీ.

పాపులర్ సింగర్ షాన్ పాడుతున్న ఓ రొమాంటిక్ మ్యూజిక్ వీడియోలో కనిపించనుంది తాప్సీ. సాకిబ్ సలీమ్ నటిస్తున్న ఈ వీడియోలో తాను డిఫరెంట్ గా కనిపిస్తానని చెప్పింది తాప్సీ. 'ఇదో కొత్త అనుభవం. యాక్టర్ గా నా ట్యాలెంట్ ను చూపించాల్సి ఉంటుంది. మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేయడం ఓ విభిన్నమైన అనుభూతి. స్టోరీ మొత్తాన్ని మూడు నుంచి నాలుగు నిమిషాల్లోనే చెప్పాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా యాక్టింగ్ కూడా ఉండాలి' అంటోంది తాప్సీ పన్ను.

కొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటు దగ్గుబాటి రాణాతో ఘాజీ మూవీలో కూడా నటిస్తున్న తాప్సీ.. సినిమాల ఎంపికలో మాత్రం అలర్ట్ గా ఉంటోంది. నవ్వడం, ఏడవడం, డ్యాన్సులు చేయడం.. ఇప్పుడొస్తున్న సినిమాల్లో హీరోయిన్ కేరక్టర్ ఇంతే ఉంటోందని.. ఇలాంటి మూవీస్ తనకు అవసరం లేదని చెప్పిన తాప్సీ.. అంతకు మించిన కంటెంట్ తనపాత్రలోను, సినిమాలోనూ ఉంటేనే ఆ రోల్ యాక్సెప్ట్ చేస్తానని చెబుతోంది.