Begin typing your search above and press return to search.

అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్స్‌ తోనే బెల్లంకొండ ఎంట్రీ

By:  Tupaki Desk   |   18 Nov 2020 10:34 PM IST
అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్స్‌ తోనే బెల్లంకొండ ఎంట్రీ
X
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మొదటి సినిమా అల్లుడు శీనులో స్టార్ హీరోయిన్స్‌ సమంత మరియు తమన్నాలు నటించడంతో సినిమాకు అనూహ్యంగా మంచి టాక్‌ వచ్చింది. స్టార్‌ హీరోయిన్స్‌ నటించిన కారణంగా మొదటి సినిమాతోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కు టాలీవుడ్‌ లో మంచి పేరు వచ్చింది. ఈ బెల్లంకొండ హీరో త్వరలో బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. చత్రపతి సినిమా రీమేక్‌ తో హిందీలో ఈయన ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సాహో దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో ఈ రీమేక్‌ రూపొందబోతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. సారా అలీ ఖాన్‌ మరియు అనన్య పాండేలు నటించబోతున్నారట. వీరిద్దరు కూడా ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ అండ్‌ క్రేజీ హీరోయిన్స్‌. అందుకే వీరిద్దరి ప్రజెన్స్‌ తో చత్రపతి హిందీ సినిమాకు మరింత వెయిట్‌ పెరుగుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుందని అంటున్నారు. బాలీవుడ్‌ మీడియాలో ప్రముఖంగా ఈ రీమేక్‌ విషయమై చర్చ జరుగుతోంది. సారా అలీ ఖాన్‌ మరియు అనన్య పాండేలు ఈ రీమేక్ లో నటిస్తే ఖచ్చితంగా అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.