Begin typing your search above and press return to search.

శుభ‌మ‌న్ గిల్ తో సారా ప్రేమాయ‌ణం నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   15 Oct 2022 5:58 AM GMT
శుభ‌మ‌న్  గిల్ తో సారా ప్రేమాయ‌ణం నిజ‌మేనా?
X
స్టార్ కిడ్ సారా అలీఖాన్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన‌ ప‌నిలేదు. సైఫ్ అలీఖాన్ డాట‌ర్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన‌ అమ్మ‌డు బిజీ న‌టిగా కొన‌సాగుతోంది. యంగ్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ గా ఛాయిస్ గా దూసుకుపోతుంది. గ‌తేడాది 'ఆట్రంగిరే'తో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకున్న సారా మ‌రో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోంది.

ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు చర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఇలా వృత్తిప‌రంగా బిజీగా ఉంటూనే అమ్మ‌డి పేరు ఎఫైర్ల విష‌యంలో వేగంగానే వినిపిస్తోంది. కొన్నాళ్ల పాటు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసిన‌ట్లు అప్ప‌ట్లో బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ప్ర‌చారం సాగింది. సుషాత్ ని పెళ్లాడ‌బోతుంద‌ని అన్న వార్త వినిపించింది. కానీ ఆ బంధం ఎంతో కాలం కొన‌సాగ‌లేదు.

అటుపై సారా భార‌త క్రికెట‌ర్ శుభ‌మ‌న్ గిల్ తో ల‌వ్వాయ‌ణం న‌డుపుతున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. ఇద్ద‌రి డేటింగ్ వ్య‌వ‌హారం వ‌ర‌ల్డ్ వైడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కానీ వాటికి త‌గ్గ స‌రైన ఆధారాలు దొర‌క‌లేదు. దీంతో ఇది గాలివార్త‌? అన్న‌డానికి బ‌ల‌మైన స్కోప్ దొరికింది. అయితే ఇద్ద‌రి వ్య‌వ‌హారంలో ఎలాంటి సందేహం లేద‌ని తాజాగా లీకైన ఫోటోల్ని బ‌ట్టి తేలిసిపోతుంది.

ఇద్ద‌రు ఓ హాట‌ల్ లాబీలో చాటింగ్ చేసుకుంటో ఉన్న వీడియో సహా అదే రోజు సాయంత్రం ఇద్ద‌రు ఒకే ప్లైట్ లో జ‌ర్నీ చేయ‌డం. ఇద్ద‌రు ముఖాల‌కు స్కార్ప్ క‌ట్టేసుకుని క‌నిపించడం ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో ఇద్ద‌రి వ్య‌వ‌హరం నిజ‌మే? అన్న బ‌ల‌మైన ఆధారం దొరికిన‌ట్లు అయింది. ఇంత‌కాలం సందేహంగా మారిన ప్రేక్ష‌ప‌క్షుల‌ ప్రేమ క‌లాపం ఒక్క జ‌ర్నీతో బాలీవుడ్ కన్ప‌మ్ చేసుకుంటుంది.

ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. దీంతో అభిమానులు కొత్త జోడీపై ఆస‌క్తిక‌ర కామెంట్లు గుప్పిస్తున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంతో? అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇంత వ‌ర‌కూ ఏనాడు సారాగానీ...శుభ్ గానీ ఈ విష‌యం గురించి ఎక్క‌డా లీక్ చేసింది లేదు. హింట్ ఇచ్చింది లేదు. నెట్టింట జ‌రుగుతోన్న ప్ర‌చారం త‌ప్ప అది ప్రేమ‌? స్నేహ‌? అన్న‌ది క‌న్ప‌మ్ కావాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.