Begin typing your search above and press return to search.

మరి లిప్ లాక్ కిస్ ఎందుకు పెట్టుకున్నారు?

By:  Tupaki Desk   |   18 March 2019 7:40 AM GMT
మరి లిప్ లాక్ కిస్ ఎందుకు పెట్టుకున్నారు?
X
ఎనిమిదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ అనే సినిమా వచ్చింది. పాటలు పవన్ పెర్ఫార్మన్స్ బాగానే పేరు తెచ్చుకున్నా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. దీని ఒరిజినల్ వెర్షన్ హిందీలో వచ్చిన లవ్ ఆజ్ కల్. సైఫ్ అలీ ఖాన్ చేసిన ఆ మూవీ బాలీవుడ్ లో ఆ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్. కానీ తెలుగులోనే మన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు దాన్ని మలచలేకపోయారు. హిందీ వెర్షన్ దర్శకుడు ఇంతియాజ్ అలీకి దీని వల్లే చాలా పేరు వచ్చింది.

గత కొద్దిరోజులుగా దీని సీక్వెల్ రూపొందుతున్నట్టు బాలీవుడ్ మీడియాలో గట్టి ప్రచారమే జరుగుతోంది. దీనికో కారణం ఉంది. ఆన్ లైన్ లో కార్తీక్ ఆర్యన్-సారా అలీ ఖాన్ ఓ పబ్లిక్ ప్లేస్ లో ఘాడంగా లిప్ టు లిప్ కిస్ చేసుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇది లవ్ ఆజ్ కల్ 2 షూటింగ్ లో తీసిందే అనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఇంతియాజ్ అలీ తరఫున టీమ్ దీన్ని కొట్టిపారేస్తోంది. లవ్ ఆజ్ కల్ 2 అసలు ప్రతిపాదనలోనే లేదని అయితే ఆ ముద్దు వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఏ సందర్భంలో తీశారో తమకు తెలియదని క్లారిటీ ఇస్తున్నారు.

సో సారా అలీ ఖాన్ కార్తీక్ ఆర్యన్ లు ఎందుకు చుంబనాలు చేసుకున్నారో తెలియాల్సి ఉంది. ఈ ఇద్దరూ డీప్ లవ్ లో ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. వీటికి బలం చేకూరేలా ఇప్పుడీ న్యూస్ రావడంతో ప్రస్తుతానికి ఈ జంట సైలెంట్ అయ్యింది. కేదార్ నాధ్-సింబాలతో చేసిన రెండు సినిమాలకె సారా టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. చూస్తుంటే సవితి తల్లి కరీనాలా తక్కువ టైంలోనే పాపులారిటీ తెచ్చుకోవాలని ఉంది కాబోలు.