Begin typing your search above and press return to search.

స్టార్ కూతుళ్ల హంగామా ఎక్కువైందా?

By:  Tupaki Desk   |   21 Jun 2016 6:27 AM GMT
స్టార్ కూతుళ్ల హంగామా ఎక్కువైందా?
X
స్టార్ కిడ్స్.. వీరి మీద ప్రపంచం మొత్తం ఓ కన్నేసి ఉంచుతుంది. ఎక్కడ ఏ మాత్రం తేడాగా కనిపించినా.. వారికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో కనిపించేస్తూ ఉంటాయి. ఈ మాత్రం దానికి ఇంత హంగామా ఎందుకంటూ.. వాళ్లే ఫోటోలు తీసి సోషల్ సైట్లలో పోస్ట్ చేసేస్తున్నారు. అమితాబ్ మనవరాలు నవ్య నవేలి నందా - సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ ల హంగామా అయితే.. ఆన్ లైన్ లో విపరీతంగా ఉంటుంది.

వీళ్లు ఈ మధ్యనే స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కానీ.. నెట్లో వీళ్ల హల్ చల్ చూస్తుంటే.. ఏ బాలీవుడ్ హీరోయిన్ కి తక్కువగా అనిపించదు. అసలు ప్రపంచం తమ గురించో, తమ కుటుంబం గురించో ఏమనుకుంటుందో లాంటి పట్టింపులు కూడా వీరికి కనిపించడం లేదు. పైగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్న రేంజ్ లో తెగ పోస్ట్ లు చేసేస్తుంటారు. ముఖ్యంగా నవ్య నవేలి పోస్ట్ లలో అయితే.. క్లీవేజ్ లు ఉంటాయి... స్కిన్ షోలు ఉంటాయి.. పార్టీలుంటాయి.. పబ్ పిక్చర్స్ తో పాటు.. కుర్రాళ్లతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా కనిపిస్తాయి. హాట్ అండ్ సెక్సీ నవ్య అంటూ ఇప్పటికే ఈమెకు బోలెడంత ఫాలోయింగ్ ఉంది.

నవ్యతో కంపేర్ చేస్తే అంతగా సోషల్ మీడియాలో సారా కనిపించదు కానీ.. ఈమె కూడా ఏం తక్కువ కాదు. పొట్టి పొట్టి డ్రస్సులతో ఓ రేంజ్ లో టాప్ లేపేస్తుంటుంది. రాబోయే కాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పటికే స్టాంప్ పడిపోవడంతో.. ఎవరికుండాల్సిన ఫాలోయింగ్ వాళ్లు ఇప్పటి నుంచే సంపాదించేసుకుంటున్నారు.