Begin typing your search above and press return to search.

క్రికెట‌ర్ తో న‌ట‌వార‌సురాలి డేటింగ్?

By:  Tupaki Desk   |   30 Aug 2022 4:58 PM GMT
క్రికెట‌ర్ తో న‌ట‌వార‌సురాలి డేటింగ్?
X
క్రికెట‌ర్ల‌తో క‌థానాయిక‌ల ఎఫైర్ క‌హానీలు నిరంత‌రం వింటున్న‌వే. కానీ ఈసారి ఓ యువ‌జంట న‌డుమ సంథింగ్ ఏదో ర‌న్ అవుతోంద‌న్న‌ది తాజా నివేదిక‌. బాలీవుడ్ లో ప్ర‌ముఖ హీరో న‌ట‌వార‌సురాలిగా అడుగుపెట్టి వ‌రుస చిత్రాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న స‌ద‌రు అందాల భామ ప్ర‌ముఖ యువ క్రికెట‌ర్ తో నిండా ప్రేమ‌లో ఉంద‌ని పుకార్ షికార్ చేస్తోంది. ఇంత‌కీ ఈ జోడీ ఎవ‌రు? అంటే.. సైఫ్ అలీఖాన్ వార‌సురాలు సారా అలీఖాన్.. యువ క్రికెట‌ర్ శుభ్ మాన్ గిల్.

ట్యాలెంటెడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ స్నేహాలు నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ భామ‌ ముంబైలోని ఓ రెస్టారెంట్ లో క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ తో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

ఈ జంట‌ కలిసి భోజనం చేస్తున్న ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. నిజానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో శుభ్ మన్ డేటింగ్ చేస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి.

సారా అలీ ఖాన్ బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ ల‌ పెద్ద కుమార్తె. ఆమె గతంలో `లవ్ ఆజ్కల్ 2` చిత్రంలో కనిపించిన కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అంత‌కుముందు కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సారా డేటింగ్ గురించి పుకార్లు వ‌చ్చాయి.

శుభ్ మాన్ గిల్ భారత క్రికెట్ జట్టులో భాగం. ఫిబ్రవరి 2017లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. ఇక ఇటీవ‌లే సారా అలీఖాన్ త‌న ఎఫైర్ క‌హానీ గురించి `కాఫీ విత్ క‌ర‌ణ్ 7` షోలో ఓపెన్ గా వెల్ల‌డించింది.

నటనా కెరీర్ విషయానికొస్తే.. చివరిగా అత్రాంగి రే లో తెరపై కనిపించిన సారా అలీ ఖాన్ తదుపరి విక్రాంత్ మాస్సేతో కలిసి గ్యాస్ లైట్ లో కనిపించనుంది. విక్కీ కౌశల్ తో లక్ష్మణ్ ఉటేకర్ చిత్రంలోనూ న‌టిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.