Begin typing your search above and press return to search.
నాలుగు చేతులా ఆర్జిస్తున్న స్టార్ డాటర్
By: Tupaki Desk | 17 Jan 2020 7:47 AM GMTసైఫ్ అలీఖాన్ వారసురాలిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ వస్తూనే రెండు విజయాల్ని ఖాతాలో వేసుకుంది. కేదారనాథ్ యావరేజ్ గా ఆడినా సింబా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నటించిన రెండు సినిమాలతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది. డాడ్ ఇమేజ్ తో పని లేకుండా సక్సెస్ తో తనకంటూ ఓ ఐడెంటీని సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా రెండు సినిమాలతో బిజీగా ఉన్న సారా లవ్ ఆజ్ కల్ సీక్వెల్ సహా కూలీ నెంబర్-1 చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో తనకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా బ్రాండ్ ప్రమోషన్స్ లోనూ సారా స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు.
ఆరంభంలో రెండు మూడు బ్రాండ్ లకే ప్రచారకర్తగా పనిచేసిన సారా ఇండస్ట్రీ బెస్ట్ టాప్ 10 బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. వివో- గార్నియర్- పూమా- ఫాంటా- మెబి లైన్- ఫుట్ వేర్ హ్యాండ్ బ్యాగ్స్- కాస్మోటిక్స్ కంపెనీలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తూ సీనియర్లకే గట్టి పోటీనిస్తోంది. గతంలో ఐశ్వర్యరాయ్, జెనీలీయా ల మధ్య గట్టి పోటీ ఉంటేది. వీరంతా మదర్స్ అయ్యాక బ్రాండ్ వ్యాల్యూ పడిపోవడంతో కంపెనీలు యంగ్ బ్యూటీస్ వైపు మళ్లాయి. కమర్షియల్ ప్రకటనల్ని నవతరం క్రేజీ నాయికలతోనే రూపొందిస్తున్నాయి. ఇది సదరు నాయికలకు భారీ రెవెన్యూ తెచ్చి పెడుతోంది.
ప్రస్తుతం కేవలం బ్రాండ్స్ ద్వారా ఏడాదికి 30 కోట్ల ఆదాయం సారా ఖాతాలో జమ అవుతోందట. అంటే సారా క్రేజ్ బ్రాండ్ ప్రమోషన్స్ లోనూ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సారా బాలీవుడ్ లో నటించింది రెండు సినిమాలే అయినా....ప్రచార కర్తగా తక్కువ సమయంలోనే ఇంత బిజీ అవ్వడం విశేషం. నటిగా ఆన్ స్క్రీన్ పై సక్సెస్ అయింది... బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరిస్తూ బుల్లి తెర ప్రేక్షకులకు మెప్పిస్తోంది. ఇలా రెండు చేతులా కోట్లాది రూపాయాల సంపాదిస్తోంది. కుమార్తె ఎదుగుదలను చూసి తండ్రిగా సైఫ్ ఎంత గర్వపడాల్సిన సందర్భమిది. దీనిపై సారా ఫ్యాన్స్ లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.