Begin typing your search above and press return to search.
స్టార్ కిడ్ పబ్లిసిటీ జిమ్మిక్కులు
By: Tupaki Desk | 10 Dec 2018 4:15 PM GMTవివాదంతో ప్రచారం ప్రస్తుత ట్రెండ్. అలా కాకపోతే ఏదో ఒక రకంగా పబ్లిక్ ని ఆకర్షించాలి. లేదంటే ఎవరైనా ఎందుకు తమ సినిమాలు చూస్తారు? ప‌్రస్తుతం అలాంటి జిమ్మిక్కునే ఈ స్టార్ కిడ్ పాలో చేస్తోందా? అంటే అవుననే అనిపించక మానదు. ముస్లిములు హిందూ దేవాలయాలకు వెళ్లడం దేవుళ్లకు దణ్ణాలు పెట్టడం ఓ స్టంట్ అనుకుంటే - హిందువులు జిహాదీ చేయడం మరో రకం స్టంట్. మత మౌఢ్యంతో కొట్టుకు చచ్చే సనాతన ఆచారాలు భారతదేశంలో ఎంతగా పాకిపోయాయో ప్రత్యేకించి చెప్పాలా? అందుకే ఇప్పుడు స్టార్ కిడ్ - పటౌడీ వారసురాలు సారా అలీఖాన్ యాక్టివిటీ చర్చకొచ్చింది.
జీహాద్ చేస్తే స్టార్లలకు హిందువుల నుంచి తంటాలు.. అదే ఒక ముస్లిమ్ హీరో గుడికి వెళితే జిహాదీలు మెచ్చరు. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా బాలీవుడ్ స్టార్లు అందరు దేవుళ్లను కొలుస్తూ సమానత్వం చూపిస్తుంటారు. తమకు దేవుళ్ల విషయంలో విభేధాలు లేనేలేవని ఇళ్లలోనే అందరు దేవుళ్లకు పండుగలు చేసి చూపించారు. అదంతా ఒకెత్తు అనుకుంటే బాలీవుడ్ సినిమాల్లోనూ అందరు దేవుళ్లను చూపిస్తున్నారు.
లేటెస్టుగా హిందూ - ముస్లిమ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన `కేదార్ నాథ్` రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో స్టార్ కిడ్ సారా అలీఖాన్ వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో హిందూ దేవుళ్లను పూజించే పరమభక్తురాలిగా, రిచ్ గాళ్‌గా సారా నటిస్తే - కథానాయకుడు ఒక పేద ముస్లిమ్ గా కనిపించాడు. తన సినిమాకి ప్రమోషన్ కావాలనుకుందో ఏమో ఈ అమ్మడు ఏకంగా ప్రసిద్ధ సోమనాథ్ ఆలయానికి వెళ్లి ప్రదక్షణలు చేసింది. పైగా రోడ్ పైనే ప్రసాదాలను పంచి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. రోడ్డు మీద సామాన్యులకు ప్రసాదాలు పంచడంతో ఈ అమ్మాయిలో దైవ భక్తి మెండుగానే ఉంది అంటూ చర్చ మొదలైంది. అయితే సారా స్వతహాగానే హిందూ దేవుళ్లను పూజిస్తుందా.. లేక ఇది తన సినిమా రిలీజ్ వేళ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందా? అన్న చర్చ అభిమానుల్లో సాగుతోంది. దేవుడి గుడికి భక్తితో వెళ్లాలి. దేవుడా నువ్వు బావుండు.. నువ్వే బావుండు! అని ప్రార్థించాలని పూరి బిజినెస్‌మేన్‌తో చెప్పించాడు. మరి సారా ఏమని మొక్కిందో కానీ, ఇప్పటికైతే ఇదో పబ్లిసిటీ స్టంట్ లానే భావించాల్సి వస్తోంది. మరోవైపు సారా డెబ్యూ ఏమంత పెద్ద హిట్టు కాదు. కేదార్‌నాథ్ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే ఈ క్యూట్ బేబికి మాత్రం చక్కని గుర్తింపు దక్కింది.