Begin typing your search above and press return to search.
సింబా బ్యూటీ.. యాడ్లే యాడ్లు ఆదాయమే ఆదాయం!
By: Tupaki Desk | 1 Jun 2019 10:09 AM GMTగ్లామర్ ఇండస్ట్రీ అనేది ఒక చిత్రమైన ప్రపంచం. ఒకసారి గుర్తింపు తెచ్చుకుంటే చాలు అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. ఇక కాస్త స్మార్ట్ గా ఉంటే బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చు. బాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోలను తీసుకుంటే వారికి సినిమాల ద్వారా వచ్చే అదాయం కంటే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. తాజాగా ఆ లిస్టులో ఇప్పుడు స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ చేరిపోయింది.
సైఫ్ అలీ ఖాన్.. అమృతా సింగ్ ల ముద్దుల కూతురైన సారా 'కేదార్ నాథ్' సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ గా పోయినేడాది ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్. రెండో సినిమా 'సింబా' బ్లాక్ బస్టర్. దీంతో సారా కు యూత్ లో క్రేజ్ పెరిగింది. పలు కార్పోరేట్ బ్రాండ్స్ ఆమెను ను బ్రాండ్ అంబాజిడర్ గా నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయట. సారా తన బ్రాండ్ ప్రమోషన్ డీల్స్ కుదిర్చే కాంట్రాక్ట్ ను క్వాన్ సంస్థకు అప్పగించింది. క్వాన్ పేరు ఎక్కడో విన్నట్టుందా? మన రానా దగ్గుబాటి ఈ సంస్థలో భాగస్వామి. ఈ క్వాన్ వారు ఇప్పటికే దాదాపుగా సారా కోసం11 కార్పోరేట్ బ్రాండ్స్ తో ప్రమోషన్ డీల్స్ ను సెట్ చేశారట. ఆ బ్రాండ్స్ లిస్టులో పూమా.. వీట్.. టీబీజెడ్.. సెరిజ్.. ఫాంటా ఇంకా మరికొన్ని బ్రాండ్లు ఉన్నాయట.
ఈ డీల్స్ ద్వారా సారాకు ఏడాదికి దాదాపుగా రూ. 30 కోట్లకు పైగా సంపాదన ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈలెక్కన ఆమెకు సినిమాలతో వచ్చే ఆదాయం కంటే ఈ యాడ్స్ ద్వారా వచ్చే ఫీజే ఎక్కువ. ఇంత సంపాదిస్తున్న సారా వయసు ఎంతనుకున్నారు. షీ ఈజ్ జస్ట్ 23! ఇక సినిమాల విషయానికి వస్తే సారా ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 'లవ్ ఆజ్ కల్' కు సీక్వెల్ 'ఆజ్ కల్' లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా 'కూలీ నెం.1' అనే మరో సినిమాలో హీరోయిన్ గా ఎంపికయిందట.