Begin typing your search above and press return to search.

వీ నెక్‌ తో వీణ వాయించేసింది!

By:  Tupaki Desk   |   9 Aug 2019 6:34 AM GMT
వీ నెక్‌ తో వీణ వాయించేసింది!
X
సైఫ్ అలీఖాన్ వార‌సురాలు సారా అలీఖాన్ సింప్లిసిటీ ప్ర‌స్తుతం హాట్ టాపిక్. ఇటీవ‌లే విమానాశ్ర‌యంలో త‌న ల‌గేజ్ ట్రాలీ త‌నే లాక్కుంటూ అంద‌రి కంటా ప‌డింది. త‌న సింప్లిసిటీని చూసి ముగ్ధుడైన సీనియ‌ర్ న‌టుడు రిషి క‌పూర్ సారాని పోగ‌డ్త‌ల్లో ముంచెత్తాడు. `శ‌భాష్ సారా సెల‌బ్రిటీలు నిన్ను చూసి నేర్చుకోవాలి. స్టార్స్ ఎయిర్ పోర్ట్‌ లో ఎలా ప్ర‌వ‌ర్తించాలో చూపించావు. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని ఫోజు కొట్ట‌లేదు. నీ బ్యాగేజ్‌ ని నువ్వే తెచ్చుకున్నావు. అందుకోసం ఎవ్వ‌రినీ పెట్టుకోలేదు` అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ముంబై ఏయిర్ పోర్టులో ప‌లుమార్లు సారా ఇలాగే సింపుల్‌ గా క‌నిపించ‌డం హైలైట్ అయ్యింది.

ఇక ముంబాయి బంద్రాలో నిరంత‌రం ఈ అమ్మ‌డిని కెమెరా క‌ళ్లు వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా మ‌రోసారి కెమెరా కంటికి చిక్కింది. ఈసారి వీ నెక్ తో జివ్వుమ‌నిపించింది. వైట్ టాప్‌.. బ్లూజీన్స్‌ లో యూత్ హార్ట్ బీట్ ని త‌ల‌పించింది. సినిమాల్లోకి రాకుండానే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన ఈ ప‌టౌడీ మ‌న‌వ‌రాలు బాలీవుడ్ లో ప్ర‌స్తుతం బిజీ బిజీ.

సారా చేతిలో ప్ర‌స్తుతం భారీ సినిమాలే వున్నాయి. బాలీవుడ్ హైప‌ర్ హీరో ర‌ణ్ వీర్ సింగ్ తో క‌లిసి న‌టించిన తెలుగు రీమేక్ `సింబా`తో తొలి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ చిత్రాలున్నాయి. ఇంతియాజ్ అలీ రూపొందిస్తున్న `ల‌వ్ ఆజ్ క‌ల్‌` రీమేక్‌, వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తున్న `కూలీ నం.1` రీమేక్ తో పాటు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌ లో పాల్గొంటూ బిజీగా గ‌డిపేస్తోంది.