Begin typing your search above and press return to search.

సవితి తల్లితో సెక్స్ గురించి నాన్నే చెబితే!

By:  Tupaki Desk   |   12 Nov 2018 10:54 AM GMT
సవితి తల్లితో సెక్స్ గురించి నాన్నే చెబితే!
X
బాలీవుడ్ సినిమాల్లోనే కాదు ఇంటర్వ్యూలలో కూడా చాలా వింత పోకడలు ఉంటాయి. మన దగ్గర రానా ఏదో సరదాగా షోకు వచ్చిన సెలబ్రిటీని నువ్వు స్కూల్ లో లవ్ చేసిన అమ్మాయి పేరు లాంటివి అడిగితేనే ఔరా అంటూ నోరు నొక్కేసుకుంటున్న ప్రేక్షకులు లేకపోలేదు. అలాంటిది సెక్స్ లాంటి పదాన్ని ఉచ్ఛరించడానికి మనవాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఆ మధ్య ఓ సీనియర్ నటుడు ఏదో వేడుకలో పక్కలో అన్న పదాన్ని వాడినందుకే సారీ చెప్పే దాకా వెళ్ళింది వ్యవహారం.

కానీ హిందీ పరిశ్రమలో అలా కాదు. నోటికి ఏది వస్తే ఏది తోస్తే ఎవరు చూస్తున్నారు పక్కన ఎవరు ఉన్నారు అనేది పట్టించుకోకుండా మాట్లాడేస్తారు. తాజాగా కాఫీ విత్ కరన్ షోలో సైఫ్ అలీ ఖాన్ ముచ్చట్లు వింటున్నప్పుడు ప్రేక్షకులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం అతనితో పాటు కూతురు సారా ఆలీ ఖాన్ అందులో నాన్నతో కలిసి పాల్గొనడమే. నిజానికి ఇలా తండ్రి కూతుళ్లు కలిసి ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు దాన్ని చాలా ఆహ్లదకరంగా నడిపించవచ్చు. అలా చేస్తే అతను కరన్ ఎందుకు అవుతాడు.

యధావిధిగా వెకిలి పిచ్చి ప్రశ్నలతో పాటు సెక్స్ ప్రస్తావన కూడా తెచ్చాడు. సైఫ్ ఏ మాత్రం మొహమాటపడకుండ తన రెండో భార్య కరీనా కపూర్ తో ఎలా గడుపుతాను అని దాని గురించి చిన్నపాటి వర్ణన మొదలుపెట్టడంతో చెవులు మూసుకోవడం సారా వంతైంది. సారా సైఫ్ మొదటి భార్య అమృతా కూతురు. సవితి తల్లితో తన సెక్స్ గురించి నాన్న చెబుతుంటే విని తరించాలని ఏ కూతురుకైనా ఉంటుందా. సారా కూడా మినహాయింపు కాదు, అయినా విడ్డూరం కాకపోతే విడిగా చెప్పినా పర్లేదు కానీ ఇలా స్వంత కూతురిని పక్కన పెట్టుకుని సెక్స్ గురించి మాట్లాడ్డం మెచ్యూరిటీ అని మేధావులు సమర్ధించుకోవచ్చు గాక కానీ సోషల్ మీడియాలో మాత్రం దీని మీద ట్రాలింగ్ నడుస్తోంది. సారా డెబ్యూ మూవీ కేదార్ నాధ్ డిసెంబర్ లో విడుదల కానుంది. దీని కోసమే ప్రమోషన్ కోసం విస్తృతంగా మీడియాకు అందుబాటులో వస్తున్న సారా ఇలా కరన్ పుణ్యమా అని ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురుకుంది.