Begin typing your search above and press return to search.

5 కోట్ల ఫైన్.. స్టార్ హీరో కూతురుకు షాక్..

By:  Tupaki Desk   |   26 May 2018 7:57 AM GMT
5 కోట్ల ఫైన్.. స్టార్ హీరో కూతురుకు షాక్..
X
సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ హీరోయిన్ గా కొన్నాళ్ల క్రితం ఓ మూవీ ప్రారంభమైంది. కేదర్నాత్ అంటూ మొదలైన ఈ చిత్రం షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇద్దామనుకున్న సారా ఆశలు అడియాశలయ్యాయి..

సారా పరిస్థితి చూసిన సైఫ్ అలీఖాన్ రంగంలోకి దిగారు. కూతురు కోసం వెంటనే టాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహర్ తో మాట్లాడేసి బాలీవుడ్ టాప్ హీరో రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న శింబ (టెంపర్ రిమేక్)లో హీరోయిన్ గా చాన్స్ ఇప్పించారు. దీంతో ఆమె భవిష్యత్ కు బాటలు పడ్డాయి. అయితే సడన్ గా మళ్లీ కేదర్నాథ్ మూవీ దర్శకుడు అభిషేక్ కపూర్ మాత్రం ఈ వ్యవహారాన్ని తప్పు పడుతున్నాడు. సారా అలీఖాన్ కనీసం తనకు చెప్పకుండా వేరే చిత్రానికి అంగీకరించడం కచ్చితంగా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అన్నది అభిషేక్ వాదన..

సారా తనతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అభిషేక్ కోర్టు నోటీసులు పంపించారు. తనకు వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేసేందుకు రూ.5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ కేసు వేశాడు. దీంతో ఇప్పుడీ కొత్త లొల్లి హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దామనుకున్న సారాకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

రూ. 5 కోట్లకు నోటీసులు అందుకున్న సారా.. తండ్రి సైఫ్ అలీఖాన్ తో కలిసి దర్శకుడు అభిషేక్ కపూర్ ఆఫీస్ కు వచ్చారు. ఆ తర్వాత ఈ కేసు వ్యవహారం బయటకు వచ్చింది. డైరెక్టర్ తో ఎంతకో కొంతకు సెట్ చేయడానికి సైఫ్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.